Home / Entertainment / అదిరిపోయిన “సింగం-3” ట్రైలర్.

అదిరిపోయిన “సింగం-3” ట్రైలర్.

Author:

సూర్య హీరోగా వరుసగా మూడవ పార్ట్ గా వస్తున్న సినిమా సింగం-3. ఈ సినిమాలో సూర్యకు జోడిగా అనుష్క, శృతిహాసన్ నటిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, సురక్ష ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మధ్యనే రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చిన సింగం3 ట్రైలర్ దుమ్ములేపుతుంది. నీతి/ నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయి.

ఇంతకు ముందే రిలీజైన సినిమా ఈ టీజర్ కి ఐదు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. కబాలి సినిమా తరవాత అతి తక్కువ సమయంలో ఇన్ని వ్యూస్ సాధించి ఈ టీజర్ రికార్డ్ సొంతం చేసుకోవడం చెప్పుకోదగిన అంశం. సింగం సిరీస్ లో వరుసగా రెండు సినిమాలు మంచి విజయాన్ని అందించడంతో మూడవ సినిమాగా అందరిని అలరించడానికి వస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకొని డిసెంబర్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొన్న విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ని మీరు కూడా చూసెయ్యండి.

(Visited 1,107 times, 1 visits today)