Home / health / డయాబెటిస్(షుగర్ వ్యాధి) ఉందని భయపడకండి..! ఇప్పుడు సులభంగా తగ్గించుకోవచ్చు..!

డయాబెటిస్(షుగర్ వ్యాధి) ఉందని భయపడకండి..! ఇప్పుడు సులభంగా తగ్గించుకోవచ్చు..!

Author:

మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. భారత దేశం మొత్తాన్ని ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి మధుమేహం అదే చక్కర వ్యాధి , షుగర్ వ్యాధి. ఇది భారత దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కచ్చితంగా ఉంది అంటున్నారు మన ఆరోగ్య నిపుణులు…. మన దురదృష్టం ఏమిటంటే ఇంత వరకు ఈ వ్యాధికి సరైన మందు కనుగొనలేదు.కానీ సరైన ఆహార నిమయమాలు పాటిస్తే కచ్చితంగా దీనివలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు నిపుణులు…

we-can-control-diabetes-disease-with-food-habits

ఇంతకు ఈ వ్యాధి వారికి వస్తుందో తెలుసా:

  • ఎక్కువగా బరువు ఉన్నవారికి( ఏ వయసు వారికైనా).
  • శారీరక శ్రమ లేనివారికి ( ఎక్కువగా కుర్చునేవారికి).
  • త్రీవ్ర మానసిక ఒత్తిడి ఉన్నవారికి.
  • కొన్ని సందర్భాలలో వారసత్వం పరంగా కూడా వస్తుంది.
  • ఎక్కువ ఆహారం తినేవారికి కూడా వస్తుంది.

వ్యాధి లక్షణాలు :

  • చర్మ వ్యాధులు తరచు వస్తుంటాయి.
  • ఆకలి ఎక్కువగా ఉండటం.
  • మూత్రం ఎక్కువ సారు రావడం.
  • ఎక్కువగా దాహం వేయడం.
  • ఒక్కసారిగా బరువు తగ్గడం.
  •  గాయం అయినా చోట తొందరగా తగ్గకపోవడం.

ఇలాంటి వ్యాధి అదుపులో ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆహారం :

  • “కడుపు నిండకూడదు – ఖాళీ వుండకూడదు” అన్నట్టుగా తినడం అలవాటు చేసుకోవాలి …..
  • గోధుమలు,రాగులు జొన్నలు మరియు ఆకుకూరలు, వంకాయ, బెండ, కాకర, పొట్ల, కాబేజి, దొండకాయ, మునగకాడలు, టమాట, కాలిఫ్లవర్ మొదలగునవి ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి
  • ఉదయం పూత రాగి జావా తాగడం చాలా మంచిది
  • ప్రతి రోజు ఎత్రీదో ఒక రూపంలో మెత్తుల్ని తీసుకోవడం వలన ఈ వ్యాధి అదుపులో ఉంటుంది.

అలాగే రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి అందులో ముఖ్యంగా 20-30 నడక లేదా ఈత లాంటివి అలవాటు చేసుకోవాలి …
ఇలా చేయడం వలన మీకు ఈ వ్యాధి వలన ఎలాంటి హాని ఉండదు. ఇంకెందుకు మీరు గాని మీకు తెలిసివారు గాని ఉంటే కంచితంగా పై విషయాలు పాటించమని చెప్పాండి.

(Visited 5,519 times, 1 visits today)