Home / Inspiring Stories / ఏ గ్రూప్ బ్లడ్ కావాలన్నా ఇక్కడ వెంటనే దొరుకుతుంది..!

ఏ గ్రూప్ బ్లడ్ కావాలన్నా ఇక్కడ వెంటనే దొరుకుతుంది..!

Author:

మన దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకి ఒకరు రోడ్డు ప్రమాదం కారణంగా మరణిస్తున్నారు, 2015 వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా 146133 మంది మరణించారు, వీరిలో ఎక్కువమంది సరైన సమయానికి కావాల్సిన రక్తం దొరకకపోవడం వల్లనే మరణించారు, రోడ్డు ప్రమాదాలతో పాటు వివిధ రకాల శస్త్ర చికిత్స లలో కూడా పెద్ద ఎత్తున రక్తం కావాల్సి వస్తుంది, అలాంటి సమయంలో రక్త దాతలు దొరకకపోతే పేషేంట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది, ఇలా ఇబ్బందులు పడకుండా సరైన సమయానికి రక్తం అందించేందుకు కొన్ని వెబ్ సైట్లు పని చేస్తున్నాయి.

blood-donors-list-websites

Friends2Support :

ఫ్రెండ్స్ 2 సపోర్ట్ అనే వెబ్ సైట్ మన దేశంలో ఎక్కువమంది రక్త దాతల వివరాలని కలిగిఉన్న ఒక వెబ్ సైట్ షరీఫ్ అనే స్టూడెంట్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ వెబ్ సైట్ ని రూపొందించాడు, ఈ వెబ్ సైట్ లో మనకి కావాల్సిన బ్లడ్ గ్రూప్, రాష్ట్రం, సిటీ వివరాలని నింపి క్లిక్ చేస్తే మన ప్రాంతంలో ఉన్న రక్త దాతల పేర్లు, ఫోన్ నెంబర్లు వస్తాయి, వారికి మనం ఫోన్ చేసి మాట్లాడాలి, వాళ్లంతా ఉచితంగానే బ్లడ్ ని డొనేట్ చేస్తారు.
వెబ్ సైట్ : Friends2Support.org

Blood Plus :

బ్లడ్ ప్లస్ అనే వెబ్ సైట్ ని శశి అనే సివిల్ ఇంజనీర్ ఏర్పాటు చేసాడు, ఒకరోజు తన ఫ్రెండ్ కి రక్తం అవసరం అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ కష్టాన్ని చూసి, అలాంటి పరిస్థితులలో ఉన్న వారికి సహాయం చేయాలనే తపనతో బ్లడ్ ప్లస్ అనే వెబ్ సైట్ ని ప్రారంభించాడు, ఆ వెబ్ సైట్ లో రక్తదానం చేయాలనుకునే వారు వివరాలని నమోదు చేసుకోవచ్చు, రక్తం కావాల్సిన వారు ఆ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి ఏ గ్రూప్ రక్తం, ఏ ప్రాంతం అనే వివరాలని చెప్తే వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న రక్త దాతల వివరాలు వస్తాయి.                                                                                                           వెబ్ సైట్ : bloodplus.in

ఇలా చాలా వెబ్ సైట్లు రక్త దాతల వివరాలని మనకి అందిస్తున్నాయి, ఇలాంటి వెబ్ సైట్ లలో మనం రక్త దాతలుగా చేరిపోవచ్చు, మన బ్లడ్ గ్రూప్, నివసిస్తున్న ప్రాంతం వివరాలు, మొబైల్ నెంబర్ వివరాలు వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు, ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా కూడా లాగిన్ అవ్వొచ్చు. ఆపద సమయంలో రక్తం అందించే విధంగా పని చేస్తున్న వారిని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే.మీరు కూడా ఈ వెబ్ సైట్ లలో రిజిస్టర్ అయ్యి ఆపదలో ఉన్న ప్రాణాన్ని నిలబెట్టండి. ఈ విషయాన్నీ అందరికి షేర్ చేయండి.

రక్త దాతల వివరాలని అందించే మరికొన్ని వెబ్ సైట్లు:

(Visited 2,963 times, 1 visits today)