Home / Inspiring Stories / భారతదేశం గురుంచి అరిస్టాటిల్, అలెగ్జాండర్ తో ఏమన్నాడు..?

భారతదేశం గురుంచి అరిస్టాటిల్, అలెగ్జాండర్ తో ఏమన్నాడు..?

Author:

అలెగ్జాండర్… ఈ మాట వినగానే మనకు వీరోచిత యుద్ద వీరుడు గుర్తుకు వస్తాడు. యుద్ధానికే కొత్త నిర్వచనం ఇచ్చిన ఒక దైర్య సాహసి. ప్రపంచాన్ని జయించాలన్న ఆకాంక్షతో బయలుదేరి ఎలాంటి శత్రువును అయిన తనకు ఉన్న తెలివితేటలతో విజయం సాదించేవాడు. కానీ అలాంటి యోధుడికి కూడా ఓటమి భయం పుట్టించిన దేశం భారతదేశం. అలెగ్జాండర్ భారతదేశము మీదకు దండయాత్రకు వచ్చే ముందు తన గురువు అయిన అరిస్టాటిల్ కు ఇలా చెప్పాడట…. గురువుగారు నేను ప్రపంచంలోనే ఎన్నో బలమైన దేశాలను మట్టి కరిపించా… ఇక ఇప్పుడు భారతదేశానికి వెళ్ళుతున్నా అని, కానీ అరిస్టాటిల్ కు అలెగ్జాండర్ భారతదేశం వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే తనకు తెలుసు భారతదేశం ఎంత ప్రేమ చూపిస్తుందో ఎదురుతిరిగితే అంతే చీల్చిపారేస్తుందని. కానీ అలెగ్జాండర్ చాలా బ్రతిమిలాడి, నా వీరత్వానికే ఒక సవాల్ అని తన గురువు గారిని ఒప్పించాడు. చివరకు ఇక భారతదేశం బయలుదేరే ముందు అలెగ్జాండర్ తన గురువు గారి(అరిస్టాటిల్) దగ్గరికి వెళ్ళి… నేను భారతదేశనికి వెళ్ళుతున్న మీకు తిరిగి వచ్చేటప్పుడు ఏం తీసుకురమ్మంటారు అని అడిగాడు అలెగ్జాండర్ అప్పుడు అరిస్టాటిల్  భారతదేశం నుండి నాకు కావలసినవి, నేను కోరుకున్నవి ఐదు ఉన్నవి అవి,

aristotle-to-Alexander

  • భారతదేశపు గుప్పెడు మట్టి,
  • గంగా నదిలోని గుక్కెడు నీళ్ళు,
  • రామయణ గ్రంధం,
  • మహాభారత గ్రంధం,
  • ఒక గురువును తీసుకురమ్మని.

పైన ఉన్న ఐదు అడిగాడట! ఇది విన్న అలెగ్జాండర్ ఆశ్చర్యంగా తన గురువు గారిని చాలా సమయం అలాగే చూస్తుండిపోయాడట!
అప్పుడు అరిస్టాటిల్ నేను అడిగినవి ప్రపంచంలో అతి పరమ పవిత్రమైనవి, నువ్వు జాగ్రతగా వెళ్లి వచ్చేటప్పుడు వాటిని జాగ్రతగా తీసుకురా… అన్నాడట.

భారతదేశపు గుప్పెడు మట్టి: భారత దేశంలో ఎంతో మంది మహానుభావులు జన్మించారు, సంచరించారు అటువంటు గొప్ప మట్టి ప్రపంచంలో మరెక్కడా దొరకదు, అటువంటి మట్టిని తీసుకురా, ప్రతి రోజు పూజించుకుంటా అని అరిస్టాటిల్, అలెగ్జాండర్ తో చెప్తాడు.

గంగా నదిలోని గుక్కెడు నీళ్ళు: భారతదేశంలో అతి పెద్ద నది గంగా నది.ఇది హిమాలయాలలో పుట్టి భారతదేశంలో చాలా ప్రాంతాలనుండి పారుతూ చివరకు సముద్రంలో కలుస్తుంది. కానీ మధ్యలో అనేక భూములను పచ్చటి పంట పొలాలుగా మారుస్తుంది దీని వలన చాలా మంది ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అందువలన గంగా నదిని ఒక దేవతగా ఇక్కడ పూజిస్తారు. అలాగే ఈ నది అనేక ప్రాంతలనుండి పారుతుంది కాబట్టి అనేక ప్రాంతాల మట్టిని తనలో కలుపుకుంటుంది. అందుకే ఎంతో గొప్పతనం కలిగిన స్వచ్ఛమైన గంగా నీటిని తీసుకరమ్మన్నాడు.

రామయణ గ్రంధం:
రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. ఒక వ్యక్తి ఎంత ఉత్తమంగా ఉండాలో రామాయణ గ్రంథంలో ఉంటుంది, అందుకే ఆ గ్రంథాన్ని తీసుకరమ్మన్నాడు.

మహాభారత గ్రంధం: మహాభారతం ఒక గ్రంధం కాదు. పరిపూర్ణ నాగరికతకు ప్రతిబింబం. ఇందులో మానవ జీవితానికి, సంఘ నిర్మాణానికి సంబంధించి ప్రతిఫలించని విషయం అంటూ లేదు. ప్రాచీన వేదాల సారాంశాన్ని అందరికీ అర్ధమైనట్లు చెప్ప బడిన చరిత్ర తప్ప ఒక మతానికో సంస్కృతికో చెందిన గ్రంధం కాదు, అందుకే మహాభారత గ్రంథాన్ని తీసుకరమ్మన్నాడు

గురువు: భారతదేశపు గురువులు చాలా ఉత్తమమైన వాళ్ళు, ఎంతో మంది మహానుభావుని తయారుచేసే భారతదేశ గురువులని దైవంతో సమానంగా భావిస్తారు, అలాంటి భారతదేశం నుండి ఒక గురువుని తీసుకువస్తే తన గురువుగా స్వీకరిస్తానని అలెగ్జాండర్ కి చెప్తాడు.

పైన తెలిపినవి ప్రపంచంలోనే పరమ పవిత్రమైనవిగా గుర్తించబడినాయి అందుకే అరిస్టాటిల్ తన శిశ్యుడు అయిన అలెగ్జాండర్ ని భారతదేశం నుండి వీటిని తీసుకొని రమ్మనాడు.  అర్ధమైందా మన భారతదేశపు గొప్పతనం…!?

(Visited 7,475 times, 1 visits today)