Home / Inspiring Stories / స్వాతంత్ర్యానికి పూర్వమే ఇంటర్ నెట్ ఉంటే…..ఇలా ఉండేది…!

స్వాతంత్ర్యానికి పూర్వమే ఇంటర్ నెట్ ఉంటే…..ఇలా ఉండేది…!

Author:

internet before 1947 in India

స్వాతంత్ర్యానికి పూర్వమే భారత్ లో ఇంటర్ నెట్ విప్లవం వచ్చి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండి ఉండేవి అనే దానిపైన ప్రస్తుతం వైరల్ గా నడుస్తున్న కొన్ని చిత్రాలు చాలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. IN1947.com పేరిట ఒక వెబ్ సైట్ రూపొందించిన ఈ ఫోటోలు చూడండి.

బ్రిటీష్ వారు ఇండియా ను పరిపాలించకూడదనటానికి 9 తెలివైన సమాధానాలు చెప్పండి అంటూ 1947 ఫిబ్రవరి లో ఇంటర్ నెట్ లో పోస్ట్ అయిన ఈ చిత్రానికి ఒక హాస్య స్పోరకమైన సమాధానం — బ్రిటీష్ వారు భారత దేశంలో వేడిమి ని తట్టుకోలేరు. ఇది బజ్ ఫీడ్ హెడ్డింగ్ తో పోస్ట్ అయిందన్న మాట.

internet before independence in india

ఇక ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ చేసిన ఇమేజ్ పైన ….మేరా భారత్ మహాన్….భారత్ స్వాతంత్ర్యం పొందింది ..అనే వ్యాఖ్య కు 28,95,673 లైక్స్ వచ్చాయి.

instagram what if india had internet before indpendence

ఫేస్ బుక్ లో 1947 మార్చ్ 25న పోస్ట్ అయిన ఫోటో లో…Troll British Page బ్యానర్ కింద జీబ్రా కు లైక్ ప్రెస్ చేయండి..బ్రిటీష్ కార్ కు కామెంట్ రాయండి అని పెడితే…జీబ్రాకి 23 వేల పై చిలుకు లైక్స్ చూపెట్టడం…..చాలా పాత విజువల్ ఎఫెక్ట్ కూడా ఆ ఫోటోలో తీసుకురావడం చాలా క్రియేటివ్ గా నూ, ఆసక్తికరంగానూ ఉంది.

what if india had internet before independence

ఇంకా ‘ఓలా’ క్యాబ్స్ 1947 నాటి ప్రచార చిత్రాన్ని చాలా తమాషాగా రూపొందించారు. రైడ్ నౌ, రైడ్ లెటర్ ఆప్షన్స్ ఇస్తూ…ఎడ్లబండికి అయితే…30 నిమిషాలు, గుర్రానికి గంట, గాడిద సవారీ కి మూడు గంటలు, రిక్షా కైతే రెండు గంటలు నిరీక్షించాలన్నట్టుగా ఇచ్చిన సజెషన్స్ కూడా ఆనాటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించాయి.

internet before independece in india

మరో చిత్రం లో ..గూగుల్ మ్యాప్స్ లో అప్పటి ఊళ్ల పేర్లను బ్రిటీష్ వారు ఎలా రాసేవారో కూడా చూడొచ్చు…..ఇక,

internet before independece in india

బుక్ మై షో వారి పేజ్ లో…అప్పట్లో నేల మీద కూర్చోవాలి కాబట్టి …ముందస్తుగా ఇసుక కుప్పాలను ఎలా సెలెక్ట్ చేసుకునేవారో ..అందులో ఎవైలబిలిటీ ఎలా ఉందీ……చాలా ఫన్నీగా చూపించారు.

internet before independece in india

ఇంకా, 1947 నాటి వాట్స్ అప్ మెసేజెస్ ఎంత స్వాంతంత్ర ఆకాంక్ష ను రేకెత్తించే విధంగా ఉండేవో కూడా చాలా చక్కగా చూపారు.

internet before independece in india

ఇంకా, గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా రిజిస్టర్ అయిన వాక్యాలు……బ్రిటీష్ వారి తో ఎలా ఫైట్ చేయాలి? ఇంగ్లీష్ లో వందేమాతరం ఎలా చెప్పాలి? గ్రామో ఫోన్ ను ఎలా రిపేర్ చేసుకోవాలీ? ప్యాంట్ ఎలా ధరించాలి? ఎడ్ల బండి ఎలా నడపాలి లాంటి ప్రశ్నలు ఎక్కువగా సెర్చ్ చేసినట్టు చూపారు.

internet before independece in india

ఇంకా, భారత్ మాట్రిమోనీ లో కూడా ..అప్పట్లో అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను కోరుకునేవారు? బ్రిటీష్ వారి కింద పని చేసే వారిని ఎలా వద్దనుకునే వారు..చెపే విధంగా రూపొందించిన పెళ్లి సంబంధాల యాడ్స్ ని చాలా తమాషాగా రూపొందించారు.

internet before independece in india

ఇందులో హై లైట్ ఏమిటంటే…యు ట్యూబ్ పోస్టింగ్..జలియన్ వాలా బాగ్ మారణ కాండ కోసం ప్రయత్నిస్తే…..బ్రిటీష్ ప్రభుత్వం ఆ కంటెంట్ ని తొలగించినట్టుగా వచ్చిన మెసేజ్ !

internet before independece in india

ఫ్లిప్ కార్ట్ బిజినెస్ ను కూడా ఇందులో వాడాల్లేడు. వందే మాతరం టీ షర్ట్ రెండు రూపాయలకు, ‘సపోర్ట్ గాంధీ’ పేరిట విడుదల చేసిన టీ షర్ట్ మూడు రూపాయలకు విక్రయిస్తున్నట్టు పోస్ట్ చేసిన కమర్షియల్ యాడ్ కూడా బాగా ఆకట్టుకుంది.

internet before independece in india

లింక్డ్ ఇన్ లో అయితే…రైతుల కోసం, ఎడ్ల బండ్లు నడిపే కార్మికుల కోసం ఓపెనింగ్స్ పేరిట చేసిన పోస్టింగ్స్ మార్వ లెస్! భారతీయ రహదార్లు, వ్యవసాయం పైన అవగాహన ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ పెట్టిన సూచన అయితే చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది.

internet before independece in india

Source: IN1947.com

(Visited 919 times, 1 visits today)