Home / health / కుడి ఎడమకన్నులు అదిరితే జరిగే అనర్థాలేమిటి ?

కుడి ఎడమకన్నులు అదిరితే జరిగే అనర్థాలేమిటి ?

Author:

పెద్దవాళ్ళు నాకు కన్ను అదురుతుంది ఏమైనా జరగకూడనిది జరుగుతదేమో అని భయపడుతుండటం మనం గమనిస్తూనే ఉంటాం. ఆడవారికి కుడికన్ను, మగవారికి ఎడమకన్ను అదరడం వలన అనర్ధాలు జరుగుతాయని చాలామంది నమ్మకం. మన సాంప్రదాయ శకున శాస్త్రంలో కూడా ఈ విషయం పొందుపరిచబడి ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించే ముందు ఆమెకు కూడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. రావణ సంహారానికి ముందు రాముడు లంకలోకి ప్రవేశించగానే, రావణుడికి కుడి కన్ను, సీతకు ఎడమకన్ను అదిరాయట. ఆ కాలం నుంచే కన్ను అదరడం వలన జరిగే శుభ అశుభ శకునాలను అంచనావేసేవారు.

what-if-your-eyes-twitch

కళ్ళు అదరడం శకునంగా అయితే ఒక లిప్త కాలంగా జరుగుతుంది. కానీ గంటల తరబడి కన్ను అదరడం అనారోగ్యానికి సూచన. నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధమైన రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

Must Read: మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!?

(Visited 10,389 times, 1 visits today)