Home / health / చూయింగ్‌ గమ్‌ నమలడం మంచిదేనా?

చూయింగ్‌ గమ్‌ నమలడం మంచిదేనా?

Author:

తరచూ పిల్లలూ, పెద్దవాళ్ళు చూయింగ్‌గమ్‌ని నమలటానికి ఆసక్తి పరుస్తారు. ఆటగాళ్లు మైదానంలో ఆటాడే సమయాల్లో చూయింగ్‌గమ్‌ని నమలడం మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. పిల్లలు కొందరు టైం పాస్ కోసం, మరికొందరు తియ్యదనం కోసం ఎక్కువగా చూయింగ్  ని నాముతుంటారు. కొందరైతే గంటల తరబడి నములుతూనే ఉంటారు. ఇంతకీ, చూయింగ్‌గమ్‌ని నమలడం వలన ఏమౌతుంది? చూయింగ్‌గమ్‌ని నమలడం లాభమా? నష్టమా ? అని ఇప్పుడు తెలుసుకుందాం.

chewing gum effect on body

మనం చూయింగ్‌గమ్‌ని నమలడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. చూయింగ్‌గమ్‌ని నమలడం వలన మెదడు కూడా చురుగ్గా మారుతుందట. ఇలా చేయటం కూడా ఓ వ్యాయామమే. ఇది మన మెదడులోని స్వయం నియంతృత నాడీ కేంద్రాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన మెదడు లోని వేగస్‌ అనే నాడి ఉత్తేజితమవుతుంది. ఇది గుండె వేగాన్ని తగ్గించడమే కాక, విశ్రాంతి భావన నీ అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మనలో చాలా మంది మనకు తెలియకుండానే గమ్ ని నమలడం వలన ఒత్తిడిని తగ్గించుకుంటున్నాం.

(Visited 1,107 times, 1 visits today)