Home / health / ఇలా చేయకూడదు. ఇలా చేయాలి. ఇవి అస్సలు తినకూడదు. ఇవి తప్పకుండా తినాలి.

ఇలా చేయకూడదు. ఇలా చేయాలి. ఇవి అస్సలు తినకూడదు. ఇవి తప్పకుండా తినాలి.

Author:


మనం నిత్యం అలవాటు వల్లనో లేదా పరిస్థుతుల వల్లనో కొన్ని పదార్ధాలు తినాల్సి వస్తుంది. అస్సలు ఏ ఏ పదార్ధాలు తింటే మంచిది మరియు ఏ ఏ పదార్ధాలు తినకూడదో తెలుసుకోవటం మంచిది. తిండి విషయంలోనే కాదు కొన్ని మన అలవాట్లు కూడా మార్చుకోవాలి.

కుక్క, కోడి చూస్తుండగా భోజనం చేయకూడదని, వాటికి కాసింత పెట్టి తర్వాత తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం మంచి పద్దతి. మిక్కిలి వేగంగా గానీ, చాలాసేపుగానీ తినకూడదు. చల్లారిన అన్నాన్ని మళ్లీ వెచ్చ పెట్టి తినకూడదు.

నెయ్యి మొదలైన ఒకటి, రెండు పదార్థాలను వెచ్చ పెట్టవచ్చునుగాని, మిగిలిన వాటిని అలా చేయకూడదు. అలాంటి ఆహారం విషంతో సమానం. మిక్కిలి వేడి అన్నం బలాన్ని పోగొడుతోంది. అలాగే బాగా చల్లబడిన ఆహారం జీర్ణం కాదు.

what-to-eat-and-what-not-to-eat

అలాగే ఆహారంలో గోధుమ, యవలు, కరక్కాయ, ఉసిరిక, ద్రాక్షలు, పెసలు, పంచదార, నేయి, పాలు, తేనె, దానిమ్మ వీటిని ప్రతిరోజూ తినాలి. అయితే ఉసిరికను మాత్రం పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, సప్తమి, ఆదివారం, రేవతి నక్షత్రం రోజున, సూర్య సంక్రమణంనాడు, రాత్రి పూట తీసుకోకూడదు.

ఇక పిండితో చేసిన పదార్థాలు, వేపుడు బియ్యం, అటుకులు మొదలైనవి భోజనం తర్వాత తినకూడదని వైద్యశాస్త్రం పేర్కొంటోంది. ముందు కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలను, నేతితో కూడుకున్న వాటిని, తర్వాత తేలికగ్గా జీర్ణం అయ్యేవాటిని, చివరిగా మజ్జిగా తీసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

(Visited 3,339 times, 1 visits today)