Home / Inspiring Stories / వాట్సప్ వాడుతున్నవాళ్లకు శుభవార్త!

వాట్సప్ వాడుతున్నవాళ్లకు శుభవార్త!

Author:

వాట్సప్ వాడుతున్న వినియోగదారులకు ఇప్పుడు శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న వీడియోకాలింగ్ సదుపాయం వాట్సప్ లోకి రానుంది. వినియోగదారులకు అందుబాటులోకి రానున్న బీటా వర్షన్ 2.16.80 టెస్టింగ్‌లో ఉంది. ఈ టెస్టింగ్ త్వరలోనే పూర్తి కానుంది ఇది పూర్తి అయిన వెంటనే అందుబాటులోకి రానుంది.ఈ వాట్సప్ కాలింగ్ ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నార! మాములుగా అయితే మనం వాట్సప్ లో మెసెజ్ చేసే సమయంలో ఆడియో పంపించుకునే వెసులుబాటు ఉంది కద! ఇప్పుడు వీడియో కాలింగ్ కూడా ఆడియో కాలింగ్ బటన్‌కే వీడియో కాలింగ్ ఫ్యూచర్‌ను యాడ్ చేస్తున్నట్లు డెవలపర్లు తెలిపారు.

Whatsapp

అయితే ప్రస్తుతం చాట్ ప్రస్తుతం చాట్ చేసే సమయంలో మనకు కుడివైపు పైన ఉండే కాలింగ్ బటన్‌ను ప్రెస్ చేస్తే డైరెక్ట్‌గా కాల్ వెళుతుంది కద!. ఈ వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక కాలింగ్ బటన్‌పై ట్యాప్ చేస్తే వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్‌లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ( రెండు సిమ్‌లు ఉన్న ఫోన్‌లో కాల్ చేసినప్పుడు సిమ్1, సిమ్2 ఎలా కనిపిస్తుందో అలా) కనిపిస్తుంది. అయితే ఈ సదుపాయం కాల్స్ మెనూ నుంచి ఉండదట. ఏ వ్యక్తితో అయితే చాట్ చేస్తుంటారో.. అప్పుడు ఆ చాట్ విండోలో నుంచి మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది.

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 7,750 times, 1 visits today)