Home / Inspiring Stories / ఇండియాలో ఇక వాట్సాప్ బంద్..?

ఇండియాలో ఇక వాట్సాప్ బంద్..?

Author:

whatsapp-ban-in-india

క్రేజీ మెసెంజర్ యాప్ అయిన వాట్పప్ భారత్‌లో బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట.కొన్నాళ్ళలోనే ఈ మెసెంజర్ యాప్ కి ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే అనే వార్త లు వినిపిస్తున్నాయి ఇటీవలే ‘ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్’ అనే కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు మరింత దగ్గరైన వాట్సప్‌పై ట్రాయ్ నిషేధం విధించే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కొత్త ఫీచర్ భారత టెలికాం నిబంధనలకు అనుగుణంగా లేదట.

ఇండియాలో ఆన్‌లైన్ సర్వీసుల్లో 40-బిట్ ఎన్‌క్రిప్షన్‌ను మాత్రమే వాడాలనే నిబంధన ఉంది. అంతకు మించి ఎన్‌క్రిప్షన్‌ వాడాలంటే భారత టెలికాం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాట్సప్ వాడుతున్న 256-బిట్ ఎన్‌క్రిప్షన్‌ ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. అంతేకాకుండా ఈ ఎన్‌క్రిప్షన్‌‌కి సంబంధించిన కీ కూడా వాట్సప్ దగ్గర లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కీ ఉంటేనే భారత టెలీకాం నుంచి ప్రత్యేక అనుమతి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వాట్సప్ మనుగడపై సందిగ్ధత నెలకొంది.తాము ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ద్వారా యాప్‌లోని డేటాను ఎవరూ హ్యాక్ చేయడానికి వీలులేదని, కేవలం సెండర్, రిసీవర్‌కు మాత్రమే ఆ మెసేజ్‌లు కనిపిస్తాయని వాట్సప్ చెబుతోంది. ఈ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత డేటా పూర్తి భద్రంగా ఉంటుందని వాట్సప్ స్పష్టం చేస్తోంది.అయితే భారత టెలీకాం నిబంధనలకు విరుద్ధంగ వాట్సాప్ ప్రవేశపెట్టిన 256-బిట్ ఎన్‌క్రిప్షన్‌‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Must Read:  స్మార్ట్ ఫోన్ పోయిందా..? గూగుల్ మ్యాప్స్ సహాయంతో కనిపెట్టవచ్చు.

(Visited 6,432 times, 1 visits today)