Home / Inspiring Stories / ఈ ఇంజినీర్ తన కష్టం మరొకరికి రాకూడదని ట్యాక్సీ డ్రైవర్ అయ్యాడు.

ఈ ఇంజినీర్ తన కష్టం మరొకరికి రాకూడదని ట్యాక్సీ డ్రైవర్ అయ్యాడు.

Author:

Taxi

ముంబై వీధుల్లో ఏ టాక్సీ డ్రైవర్నడిగినా విజయ్ ఠాకూర్ గురించి చెప్తారు. కేవలం టాక్సీ డ్రైవర్లే కాదు చాలామంది సామాన్యులకూ,ముంబై లోని ఎన్నో హాస్పిటల్ స్టాఫ్ కీ విజయ్ ఠాకూర్ ఒక నడిచే దేవుడు అంటే ఆశ్చర్యం అనిపించడు. ఎందుకంటే… అతని టాక్సీ వెనుక అనారోగ్యంతో ఉన్నవారిని ఉచితంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లబడును అని రాసి ఉంటుంది. ఆరోగ్య కారణాలతో హాస్పిటల్ కి వెళ్ళాల్సిన ఏ మనిషి దగ్గరా అతను డబ్బు తీసుకోడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హాస్పిటల్ అనే మాటవినగానే టాక్సీ తీయటానికి ముందుకొస్తాడు. తనకు వచ్చే కొంత సంపాదన లోనూ ఇంత సాయం చేస్తున్నడంటే ఎన్ని కష్టాలను చూసాడో అనుకుంటున్నారా? 50 ఏళ్ళ విజయ్ ఒకప్పుడు లార్సెన్ అనే ప్రముఖ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ముప్పయ్యేళ్ళ కిందటే అతని జీతం 10 వేలకు పైగానే ఉండేది. అయితే అతని జీవితం లో జరిగిన ఒకే ఒక విషాదం అతన్ని ట్యాక్సీ వైపు నడిపించింది. అవసరం లో ఉన్నవాళ్ళకి సహాయం చేయటం తప్ప మరో ఉద్దేశ్యం లేనట్టుగా ఉండే స్వభావాన్ని అతనికి అలవాటు చేసింది. ముప్ఫై సంవత్సరాలుగా ముంబై రోడ్లమీద ట్యాక్సీ నడుపుతున్న ఠాకూర్.అంత మంచి ఉద్యోగం వదిలేసి డ్రైవర్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందంటే.

ఒకరోజు థాకూర్ భార్య సరోజ్ నొప్పులతో బాధపడుతోంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి టాక్సీ కోసం వెతికితే, ఎంత వెతికినా టాక్సీ దొరకలేదు. దొరికిన వారేమో ఆ టైమ్‌లో హాస్పిటల్ కి రావడానికి ఒప్పుకోలేదు. ఏడుస్తూనే తిరిగీ తిరిగీ ఎలాగోలా కష్టపడి హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు.కొన ప్రాణాల అంచులలో ఉన్న తన భార్య అతి కష్టం మీద బతికింది. అయినా ఆ రోజున తను పడ్డ వేదన విజయ్ ని ఎంతో కదిలించింది.డబ్బు లేక కాదు,హాస్పిటల్ లేక కాదు కేవలం సమయానికి హాస్పిటల్ కి తన భార్యని చేర్చలేక పోతే..? ఆ ఊహ అతన్ని వణికించింది అప్పుడనిపించింది థాకూర్‌కి. ఇలాంటి పరిస్థితి రోజుకు ఎంతమందికి వస్తుందో అని.

వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి 66 వేల రూపాయలతో ఫియట్ కారు కొన్నాడు. దాని వెనకాల ఫ్రీ టాక్సీ ఫర్ ఎమర్జెన్సీ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ అని రాయించాడు. కొన్నాళ్ళకి చనిపోయిన తన భార్య పేరు మీదుగా ఈ టాక్సీ నడుపుతూ ఎంతోమందికి సాయంగా ఉంటున్నాడు. ఒకప్పుడు నెలకు 65వేల రూపాయలు సంపాదించే థాకూర్ ప్రసుతం పదివేలు సంపాదించినా సంతోషంగా ఉందని చెప్తున్నాడు.విజయ్ కి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఇద్దరూ పెద్ద ఉద్యోగాల్లోనే ఉన్నారు ఆర్థికంగా, మంచి స్థాయిలో ఉన్న థాకూర్ కొడుకులు తనని టాక్సీ డ్రైవర్‌గా రిటైర్ అవమని అడిగినా థాకూర్ ఒప్పుకోలేదు. ఆత్మసంతృప్తనిచ్చే ఈ ఉద్యోగాన్ని వదిలేస్తే ఆత్మత్యాగం చేసుకున్నట్టే అని చెప్పాడు. తోటివారికి సాయం చేయడంలోనే సంతోషాన్ని వెతుక్కునే వ్యక్తులు నూటికో, కోటికో ఒక్కడుంటాడు అని విజయ్ థాకూర్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ముంబై ప్రజలు.

(Visited 1,055 times, 1 visits today)