Home / Inspiring Stories / వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది?

వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది?

Author:

మరో వారం రోజుల్లో వినాయక చవితి మొదలవబోతుంది. ప్రతీ గల్లీలో వినాయకుడు దర్శనమివ్వబోతున్నాడు. దేశం మొత్తం ఆదిపూజ్యుడైన గణపతికి నవరాత్రులు పూజలు చేయటం జరుగుతుంది. ఈ నవరాత్రుల సమయంలో గణనాధుని విగ్రహాలు వేల సంఖ్యల్లో వివిధ ఆకారాల్లో దర్శనమిస్తాయి. వివిధ రకాల దోషాలు, వివిధ పద్ధతిలో తయారు చేయబడిన గణపతిని పూజించటం వల్ల పోగొట్టుకోవచ్చు.

which-type-of-ganesh-puja-wards-off-a-particular-dosha

  • సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
  • చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
  • కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
  • బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
  • గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
  • శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
  • దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
  • రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
  • కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
  • అనారోగ్య సమస్యలు తొలగడానికి ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
  • అప్పుల బాధలు తొలగిపోవడానికి పగడపు గణపతిని పూజించాలి.
  • మానసిక ప్రశాంతత కొరకు పాలరాయితో చేసిన గణపతిని పూజించాలి.
  • అన్ని సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
  • సుఖశాంతుల కొరకు స్ఫటిక గణపతిని పూజించాలి.
(Visited 1,675 times, 1 visits today)