Home / Latest Alajadi / ఇండియాలో తొలిసారిగా తిరిగిన బస్సులకి, కార్లకి మన రోడ్లే దారి చూపించాయి.

ఇండియాలో తొలిసారిగా తిరిగిన బస్సులకి, కార్లకి మన రోడ్లే దారి చూపించాయి.

Author:

మన ఘనత మనకు ఎప్పుడూ తెలియదు ఎదుటివారు చెప్పేవరకు, మన తెలుగువారు చాలా విషయాలలో దేశంలో చాలా పేరు సంపాదించారు. కానీ మన వారి గురించి మనకు తెలియదు. ఎందుకంటే మనకు మన ఇంట్లో చికెన్ ఉన్నా పక్కింటి పుల్లకూరనే కావాలి.

మనం ఎప్పుడు చూడని కొత్త వాహనం రోడ్ల మీదా చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతాం, అలాంటింది భారతదేశంలో తయారయిన మొదటి బస్ మన తెలుగు నేలపై తిరిగాయంటే ఆనాటి ప్రజలు ఎంత ఆశ్చర్యపడి ఉంటారో ఊహించండి. అలాగే ఇవి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. అందుకే ఇవి మన తెలుగు ప్రజలకి దక్కిన ఒక గుర్తింపు …..

which-was-the-First-Bus-Service-in-India

1903లో సిమ్సన్ అండ్ కంపెని తరపున జాన్ గ్రీన్ ఆవిరితో నడిచే కారును నిర్మించి తెలుగు నేలపై నడిపారు. ఎప్పుడు కారును చూడని ప్రజలకు అది రోడ్ పైకి వస్తుందంటే అద్భుతంగా అనిపించేది.. దీని గురించి మద్రాస్ మెయిల్ ఇండియాలో నిర్మించిన మొదటి మోటర్ వెహికల్ అని పోగడ్తలతో ముంచింది. ఆ తరువాత దాదాపు రెండు ఏళ్ల తర్వాత ఇదే జాన్ గ్రీన్ ఆవిరితో నడిచే బస్సును కనుకున్నారు.

ఈ బస్సు బెజవాడ-మచిలిపట్నం మద్యలో తిరిగింది. ఇదే ఇండియాలో తిరిగిన మొదటి బస్సుగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికి ఈ బస్ నమూనా లండన్ మ్యూజియంలో చాలా భద్రంగా ఉంది.

ఈ బస్సు నడిచిన కొన్ని సంవత్సారాల తరువాత 1920 లో బెజవాడలో కేసినేని వెంకటయ్య “కేసినేని ట్రావెల్స్” ని మొదలుపెట్టారు. ఇప్పటికి ఈ ట్రావెల్స్ మన ముందు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైన మన తెలుగు నేల ఔన్నత్యాన్ని తెలుసుకుందాం. మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెడుదాం.

(Visited 1 times, 1 visits today)