Home / Inspiring Stories / బట్టలుతకటం అమ్మ పనేనా??

బట్టలుతకటం అమ్మ పనేనా??

Author:

మనుషుల్లోనే కాదు పనుల్లో కూడా ఆడా మగా ఉంటాయి… బట్టలుతకటం, వంట చేయటం, పిల్లల్ని సంబాళించుకోవటం ఆడపనులూ, ఉధ్యోగం చేయటం, ఇంటికొచ్చాక కాళ్ళు బార్లాచాపుక్కూర్చొనొ కాఫీ కోసం ఆర్డర్ వేయటం మగ పనులూ… ఇలాగే సాగుతూ వస్తోంది…అలాగే సాగిస్తూ వచ్చారు… అయితే కాల క్రమేణా స్త్రీలూ “మగ” పనులు చేయటం మొదలు పెట్టారు ఉద్యోగాలు చదువులూ, రాజకీయాలు ఇలా అన్నిటిలోనూ మగాళ్ళ తో పోటీ పడుతున్నారూ అయినా… వారి “ఆడ” పని మాత్రం మారలేదు. ఇంకా మగవాళ్ళు మారలేదు పనిని “పని” గా మాత్రమే చూడకుండా ఇంకా పనుల్లోనూ లింగ వివక్ష ని చూపిస్తూనే ఉన్నారు. ఇకనైనా మారేది లేదా అన్న ఒక్క ఆలోచన.. ఈ వ్యాపారప్రకటణ లోనూ కనిపిస్తుంది…

తన కూతురు అన్ని పనులనూ చేస్తూనే ఆఫీసు వ్యవహారాలనూ చక్క బెట్టుకోవటం,సోఫాలో కూచుని ఆర్డర్లు వేసే అల్లున్ని చూసాక ఆ తండ్రికి ఆయన భార్య గుర్తొచ్చింది… అంతే తన కూతురికి సారీ చెబుతూ లేఖ రాసిన ఆ తండ్రి ఏం చేసాడో ఈ వీడియోలో చూడండి. కొన్ని సార్లు అడ్వర్టైజ్ మెంట్ లూ అద్బుతమైన మెసేజ్ ఇస్తాయి….

(Visited 653 times, 1 visits today)