Home / Entertainment / చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇచ్చిన దర్శకునితో అఖిల్ రెండవ సినిమా?

చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇచ్చిన దర్శకునితో అఖిల్ రెండవ సినిమా?

Author:

ఏ సినీ పరిశ్రమలోనైనా విజయం వరిస్తే పూల బాటలు వేస్తారు.అదే పరాజయానికి ముళ్ళ కంచె వేస్తారు ఇది నిజం. తెలుగు పరిశ్రమ కూడా అందులో ఒక భాగమే. అఖిల్ తన మొదటి సినిమా మిగిల్చిన చేదు అనుభవం నుండి తేరుకోవడానికి దాదాపు సంవత్సరం పట్టింది. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమ గాధ తో హిట్ అందించి, పరిశ్రమను మొత్తం తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు హను రాఘవపూడి తో తన సినిమా ఉంటుంది అని అఖిల్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపాడు. ఏమైందో ఏమో హను తన తదుపరి సినిమా నితిన్ తో చేస్తున్నాడు.

who is the director for akhil second movie

అఖిల్ తన రెండవ సినిమా కోసం గత ఆరు నెలలుగా ఎంత ప్రయత్నించినా  ఫలితం కనిపించడం లేదు. ఇక చివరికి మనం, 24 వంటి హిట్  సినిమాల  దర్శకుడు విక్రంతో ఉంటుందని సమాచారం వచ్చింది కానీ ఇంత వరకు అఫీషియల్ గా  ఎవరు ఎక్కడ ప్రస్తావించలేదు. అఖిల్  ఇప్పుడు పెళ్లిచూపులు లాంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ ని ఒక సినిమా చేయమని అడుగుతున్నాడట! మరి చూడాలి అఖిల్ రెండవ సినిమా ఎవరితో ఉంటుందో?

(Visited 38 times, 1 visits today)