Home / Inspiring Stories / లండన్ ప్రసంగంలో మోడీ చెప్పిన ఆ ఇమ్రాన్ ఎవరు?

లండన్ ప్రసంగంలో మోడీ చెప్పిన ఆ ఇమ్రాన్ ఎవరు?

Author:

Imaran Khan Alwar

“ఇమ్రాన్ నాదేశ పౌరుడు నేను గర్వంగా చెప్తున్నా” బ్రిటీష్ రాజధాని లండన్ లో సాక్షాత్తూ మన దేశ ప్రధాని అన్న మాటలివి. ఇంతగొప్పగా చెప్పిన ఆ ఇమ్రాన్ ఏ కార్పోరేట్ కంపెనీ అధినేతనో,లేదా మరో సెలేబ్రేటినో అనుకుంటాం కానీ ఇమ్రాన్ ఒక సాధారణ స్కూల్ టీచర్ సాధారణ అంటే ఇక్కడ మామూలు మనిషి అని కాదు మామూలు మనిషిని అని భావించుకునే వ్యక్తీ అని.అసలు ఎవరీ ఇమ్రాన్ ఒక దేశ ప్రధాని ఇంతగా చెప్పటానికి అతను చేసిందేమిటి?

Alwar Imran Khan

ఇమ్రాన్ రాజస్థాన్ లోని ఆల్వార్ అనే ప్రదేశం లోని సంస్కృత్ స్కూల్ లో గణిత టీచర్ గా పనిచేసే కంప్యుటర్ పరిజ్ఞానం పెద్దగా లేని ఒక సాధారణ టీచర్, తన తమ్ముడి పుస్తకాలు తీసుకొని సొంతంగా కంప్యుటర్ల గురించి నేర్చుకొని 50 యాప్ లను తయారు చేసాడు. ఈ యాప్స్ అన్నీ చదువు కు సంభందించినవే. దాదాపు 30 లక్షల మంది వాడుతున్న ఈ యాప్ లనుంచి ఒక్క పైసా లాభం కూడా ఆతను ఆశించలేదు విద్యార్ధులకు ఉచితంగా అందుబాటులో ఉంచారు, . ఆయన ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించారు.

Alwar Imran Khan

రాజస్థాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ప్రాజెక్ట్ ఆఫీసర్ గా రమ్మంటూ లేఖని పంపారు కానీ “ఉపాధ్యాయుడిగా తాను చేస్తున్న కృషి చాలా చిన్నదని. ఇంగ్లిషు భాషలో ఎన్నో యాప్ లు ఉన్నాయని. కానీ..! ప్రాంతీయ భాషల్లో అలాంటి పరిస్థితి లేదని. అలాంటి వాటిని మరిన్ని తయారు చేయటం ద్వారా గ్రామీణ విద్యను మరింత బలోపేతం చేయాలన్న తన ఆశను వ్యక్తం స్తూ” ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన తిరస్కరించారు. ఈ విషయం తెలిసిన మోడీ లండన్ వేదిక గా ఇమ్రాన్ పేరునీ ఆయన చేసిన సేవనీ ప్రపంచానికి చెప్పి నాదేశం లో అలాంటి పౌరుడు ఉందటం తనకు ఆనందం కలిగించిందనీ చెప్పి ఇమ్రాన్ ని పొగిడారు.

(Visited 396 times, 1 visits today)