Home / health / గుడిలో గంట ఎందుకు కొడతారు ?

గుడిలో గంట ఎందుకు కొడతారు ?

Author:

మనలో చాల మంది తరచూ గుడికి వెళ్తుంటాం, గుడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఉండే గంట కొట్టడం జరుగుతుంది. కానీ, గుడిలో గంట ఎందుకు కొడుతారో మీకు తెలుసా? తెలుసుకోవాలని ఉందా?

గుడికి వెళ్ళిన వారు తప్పనిసరిగా గంట కొడుతారు. ఇంట్లో లేక గుడిలో పూజ చేస్తున్నప్పుడు, హారతి ఇచ్చే సమయం లో గంట కొడుతారు. ఆలయం లో ఉన్న గంటలలో అర్దాలు చాలానే ఉన్నాయి. దేవాలయం వెళ్ళినప్పుడు గంట కొడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమేకాక, సకల శుభాలు కలుగుతాయి.

why-do-we-ring-bells-during-rituals

గంట విషయానికి వస్తే… గంటలోని ప్రతి భాగానికి ఓ ప్రత్యేకత ఉంది, అదేంటంటే…

గంట నాలుక లో సరస్వతీ మాత కొలువై ఉంటుందట. గంట ఉదర భాగంలో మహారుద్రుడు, బ్రహ్మదేవుడు ముఖ భాగంలోను, కొన భాగంలో వాసుకి మరియు పైన వుండే పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి . అందుకే గంటను పవిత్రంగా భావించి దైవంగా పూజించాలి.

మనకు భాదలు, మనశ్శాంతి కలిగినపుడు, మన మనస్సును ఆధ్యాత్మిక భావనతో నింపాలంటే భగవంతుని ముందు కంచు తో చేసిన గంటను మ్రోగిస్తే, ఆ గంట నుండి వచ్చే “ఓంకార” శబ్దం వలన దుష్ట శక్తులు దూరంగా పోయి, మన బాధలు తొలగుతాయని “కర్మ సిద్దాంతం” మనకు తెలుపుతుంది. “హారతి” సమయంలో గంటకొడితే, మన ఇంటిలో లేదా దేవాలయం లో దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని అర్ధం. హారతి సమయంలో గంట కొట్టే సమయంలో కళ్ళు మూయరాదు. ఆ సమయం లో హారతి ఇస్తూ, గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని అర్ధం.

కొన్ని ఆలయాల్లో గంటల గుత్తి మనం చూస్తుంటాం, అలాంటి గంటలు మ్రోగిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు, అవి కేవలం అలకారం కొరకు మాత్రమే.

Must Read: ఆ గ్రామాల్లో గత 95 ఏళ్ళుగా ప్రతి శ్రీ రామనవమి ముందు రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది.

(Visited 3,026 times, 1 visits today)