Home / Latest Alajadi / మామిడి ఆకులకు శుభకార్యాలకు సంబంధం ఏమిటి !.

మామిడి ఆకులకు శుభకార్యాలకు సంబంధం ఏమిటి !.

Author:

మన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగిన ఇంటి గుమ్మానికి ముందుగా కట్టేది మామిడి తోరణాలు. మన హిందూ సాంప్రదాయంలో మామిడాకులకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. పూజలు జరిపే సమయంలో కలశానికి రక్షణగా మామిడాకులను ఉపయోగిస్తారు. పచ్చని పందిట్లో శుభకార్యాలు జరిగితే దేవతలు ఆశీర్వదిస్తారని హిందువులకు ఒక నమ్మకం. ఇంతకు ఈ చెట్టు మన దేశానికి ఆంజనేయుడి ద్వారా వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. సీత అన్వేషణకు రాముడు ఆంజనేయుడి సహాయాన్ని కోరుతాడు. ఆ సమయంలో ఆంజనేయుడు సీతాన్వేషణ చేస్తున్న సమయంలో మామిడి పండు వాసనకు ఆకర్షితుడై మామిడి పండును తిని దాని టెంకను నీటిలో విసిరేశాడట. ఆ టెంక నీళ్లల్లో తేలుతూ చివరికి భారత దేశం చేరి చెట్టుగా మారిందని చెబుతుంటారు.

mango-leaves
మామిడికాయలు ప్రేమకు, సంపదకు, సంతానాబివృద్దికి సంకేత ప్రతీకలు. అందుకే మానవ జీవితంలో పైన చెప్పిన మూడు చాలా అవసరం కాబట్టి మామిడాకులు ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు.ఇది మన పూర్వీకుల నుండి వస్తున్నదే కాక మన పురాతన గ్రంధాలలో దీని గురించి చెప్పబడింది. మామిడి చెట్టును భక్తితో కొలిస్తే మన కోరికలు తీరుస్తుంది. ఈ చెట్టు సృష్టి కర్త అయిన బ్రహ్మ్మ కు అర్పించిన గ్రంధాలలో చెప్పబడింది. మామిడి పూలు చంద్రునికి అర్పించారు. కాళిదాసు మామిడి చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. శివ పార్వతుల వివాహం మామిడి చెట్టు కిందనే జరిగిందని అందుకే మామిడి చెట్టును అంత పవిత్రంగా చూస్తారని మన పెద్దలు చెబుతుంటారు. పెళ్లి కానీ యువతి, యువకులు మామిడి చెట్టుకు పసుపు, కుంకుమ రాసి భక్తితో ప్రదక్షిణాలు చేసి చెట్టును ఆలింగనం చేసుకుంటే వారికి అవుతుందని తొందరలోనే పెళ్లి అవుతుందని వారి నమ్మకం.

(Visited 997 times, 1 visits today)