Home / Inspiring Stories / అగ్రవర్ణాల పొగరుపై చెంప దెబ్బ వేసి భార్య కోసం ఒక్కడే బావి తొవ్వాడు.

అగ్రవర్ణాల పొగరుపై చెంప దెబ్బ వేసి భార్య కోసం ఒక్కడే బావి తొవ్వాడు.

Author:

babu rao

ఈ రోజుల్లో కూడా ఇంక దళితుల పై అగ్రవర్ణాల వారు పెత్తనం చలాయిస్తునే ఉన్నారు, అలాగే వారిని వారి పరిసరాలలోకి రాకుండ అడ్డుకుంటునే ఉన్నారు. కానీ మనం మట్లాడుకునే విషయం అగ్రవర్ణాల వారు దళితురాలిని అడ్డుకుంటే వారిని చెప్పుతో కొట్టినంత పని చేసి వారికి సిగ్గు వచ్చేల చేశాడు దళితుడు. కానీ అగ్రవర్ణాల వారు చేసిన తప్పువలన దళితులు మరో సారి వారిపై గెలుపు సాదించారు.

మహారాష్ట్రలోని మాలెగావ్‌ తాలూకా కొలంబేశ్వర్‌ గ్రామం  అసలే కరువు సీమ. ఊరి ప్రజలంతా గుక్కెడు నీటి కోసం నానావెతలు పడుతున్నారు. అలాంటి ఊరిలో.. నీటి కోసం బావి వద్దకు వెళ్ళిన ఒక మహిళను ‘నీవు దళితురాలివి. నీళ్లు తోడుకోవడానికి వీలు లేదు’ అంటూ అగ్రవర్ణాల వారు అడ్డుపడ్డారు. దీంతో ఆమె భర్త బాపూరావ్‌ తాజ్నే అనే దళితుడికి కుల కట్టుబాట్లు కూలగొట్టాలన్నంత కోపం వచ్చింది. తన పరిసర ప్రాతంలోనే ఒక బావిని తోడలని నిర్ణయించుకున్నాడు. కానీ బావి తవ్వడం ఒక్కడి వలన కానీ పని కాబట్టి చుట్టుపక్కల వారిని ఒకసారి అడిగి చూశాడు. దానికి వారు బాపూరావ్‌ తాజ్నే కు సహాయం చేయకపోగా… ఇది అయ్యే పని కాదు అని నిరశపరిచారు. దానితో బాపూరావ్‌ తాజ్నే కు ఇంక కసి పెరింగింది ఎలాగైన బావి తొవ్వి తీరాలి అని దృడ నిశ్చయంతో పని మొదలు పెట్టాడు. మొదటి రోజు వచ్చి కొందరు చూసి మాహా అయితే ఇంకో రోజు తవ్వి తను వదిలేస్తాడు అనుకున్నారు. ఇలా ఒకరోజు, రెండు రోజులు వరుసగా పట్టుదలతో 40రోజులు బావిని తవ్వుతూనే ఉన్నాడు. బాపూరావ్‌ తాజ్నే కష్టాన్ని చూసి గంగమ్మకే భాద అనిపించి 40వ రోజు బావిలో నీరు వచ్చింది. అంతే బాపూరావ్‌ తాజ్నే కష్టానికి ప్రతిఫలం దక్కింది.

babu rao hard work for well

ఈ విషయం ఆనోట, ఈనోట అందరికి తెలిసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మండల తహసిల్దార్‌ ఆ గ్రామానికి వెళ్లి బాపూరావ్‌ను అభినందించారు. గ్రామంలో కుల వివక్ష నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు దళితులందరికీ ఆ బావి అపర సంజీవినిగా మారింది. మహారాష్ట్రలోని మాలెగావ్‌ తాలూకా కొలంబేశ్వర్‌ గ్రామం లో జరిగింద ఈ ఘటన.

(Visited 552 times, 1 visits today)