Home / Inspiring Stories / ముఖ్యమంత్రి మెప్పు కోసం ఒక మహిళని చంపేసిన బెంగళూరు పోలీసులు..!

ముఖ్యమంత్రి మెప్పు కోసం ఒక మహిళని చంపేసిన బెంగళూరు పోలీసులు..!

Author:

ట్రాఫిక్ లో మనకు అంబులెన్స్ హారన్ వినబడితే వెంటనే పక్కకు జరిగి మరీ, మనం సైడ్ ఇస్తాం. ఎందుకంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తొందరగా హాస్పిటల్ కి చేర్చుతుంది కాబట్టి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా, ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. చాలా మంది అంబులెన్స్ వెళ్తుంటే దేవుడుకి మొక్కుతుంటారు, అందులో ఉన్నవారికి ఎలాంటి చెడు జరుగకూడదని. మరి అలాంటి అంబులెన్స్ ని 25 నిమిషాల పాటు ఒక ముఖ్యమంత్రి వెళ్లే దారిలో ఆపితే..! అందులో ఉన్న ప్రాణం కాస్తా ఆరిపోయింది. ఇది అంత జరిగింది ఎక్కడో కాదు మన పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో … మన దేశంలో ఒక VIP వస్తున్నాడు అంటే అర్ధ గంట ముందు నుండే తాను పోయే దారిలో వాహనాలు అన్ని ఆగిపోవాలి లేదంటే అక్కడ ఉన్న పోలీసులు ఇంటి దగ్గర కూర్చోవలసిందే…

ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పవలసిన అవసరం లేదు. గల్లీ నాయకుల నుండి ఢిల్లీ నాయకుల  వరకు తన వాహనంతో పాటు రయ్యి రయ్యి అంటూ 4-10 వాహనాల వరకు వెళ్తూనే ఉంటాయి. మనం ఓటు వేసి గెలిపించిన  నాయకులు వారి అవసరానికి మనల్ని రోడ్ పై  నిల్చోబెట్టి, వారు ఎక్కడ ఆగకుండా వెలుతుంటారు. ఇక ఆ సమయంలో ఎలాంటి పొరపాటు జరిగిన పాపం అక్కడున్న పోలీసు పని అయిపోయినట్టే.. ఆ సమయంలో అంబులెన్సే  రానీ, పక్కన ఎవరైనా చావనీ,  వారి వాహనాలకు మాత్రం ఎలాంటి అంతరాయం జరుగకూడదు.


“>ఇలాంటి సంఘటనే నిన్న బెంగుళూరులో జరిగింది, ప్రాణాపాయస్థితిలో ఉన్న ఒక మహిళను అంబులెన్స్ తీసుకువెళుతుంది. ఆ అంబులెన్స్  ముందు కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి ఎంత హారన్ కొట్టిన వాహనాలు పక్కకు జరగడం లేదు, అంబులెన్స్ లో  ఉన్న మహిళకు సమయం గడిచే కొద్దీ ప్రాణం పోయే స్థితికి చేరుకుంటుంది…ఇక ఇలా కాదని అంబులెన్స్  లో ఉన్న మహిళ బంధువు వెళ్లి అక్కడ ఉన్న పోలీసు వారికి జరిగిన విషయం చెప్పిన వారు మేము ఎం చేయాలి చెప్పండి అక్కడ వచ్చేది అసలే ముఖ్యమంత్రి ఒక వేళ మీ అంబులెన్స్  కి దారి ఇస్తే మా జాబ్స్ పోతాయి అని వాహనాల ముందు స్టాపింగ్ బోర్డ్స్ పెట్టారు. పాపం అంబులెన్స్  లో ఉన్న మహిళ బంధువు ఎంత బ్రతిమిలాడినా వారు చేసేది ఏమిలేక, ఇటు చెయ్యలేక నానా అవస్థలు పడ్డారు. ఇలా 10,15,20,25, నిమిషాల పాటు అంబులెన్స్  ఆ ట్రాఫిక్ లోనే ఉండటంతో అందులో ఉన్న మహిళ చనిపోయింది.

ఒక్కసారి ఆలోచించండి రాజకీయ నాయకులారా మీ కోసం మేము జెండాలు పట్టి, వాడ వాడ తిరిగి, నినాదాలు చేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీరు మాకు ఇచ్చే గౌరవం మా ప్రాణాలు పోతున్న మీరు వెళ్లే వరకు మాకు దారి ఇవ్వకపోవడం. ఇది దుస్థితికి కర్ణాటక ముఖ్యమంత్రి మాత్రమే భాద్యుడు  కాదు భారత దేశంలోని  రాజకీయ నాయకులు విఐపీ లు అందరూ భాద్యులే. మన దేశంలో తప్ప మరెక్కడా ఉండదేమో ఇలాంటి పరిస్థితి  …. ఎవరు చేసుకున్న పాపానికి వారే భాద్యులు అని, మీకు  ఓటు వేసిన పాపానికి మాకు ఇలా జరగవలసిందే….

(Visited 1,540 times, 1 visits today)