Home / Inspiring Stories / డబ్బిచ్చి వస్తువుని కొంటాను భర్తను కాదు కేరళకు చెందిన వధువు నిర్ణయం.

డబ్బిచ్చి వస్తువుని కొంటాను భర్తను కాదు కేరళకు చెందిన వధువు నిర్ణయం.

Author:

Ramya

రమ్యా రామచంద్రన్ వరకట్నం ఇచ్చి తాను ఒక భర్తని కొనుక్కోలేనంటూ తన పెళ్ళినే తిరస్కరించి వార్తల్లోకెక్కిన అమ్మాయి.”వస్తువుని కొనుక్కుంటాం కానీ భర్తనీ అలా కొనుక్కోవాలసి వస్తే నాకు అలాంటి భర్త వద్దు” అని చెప్పిన ఆమె, కట్నం అడిగారన్న కోపం తో మళ్ళీ తమకు అవేం వద్దూ అంటూ వచ్చినా ఆ పెళ్ళి చేస్కుకోనంటూ నిర్మొహమాటం గా తిరస్కరించింది.

ఇంతకీ విశయనికి వస్తే కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ ప్రాంతానికి చెందిన రమ్యా రామచంద్రన్ అనే యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గోవాలో నివాసం ఉంటోంది.ఆమెకు సంబందాలు వెతకటం మొదలు పెట్టాక వచ్చిన ఒక సంబందం వీరికి నచ్చింది అబ్బాయీ అమ్మాయీ కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే తాము కట్నానికి వ్యతిరేకమనీ,ఎటువంటి లాంచన ప్రాయ బహుమతులనూ ఇవ్వబోమని అమ్మాయి తల్లితండ్రులు ముందే చెప్పారు… అబ్బాయి తరపువారూ సరే అన్నారు నిశ్చితార్థమూ జరిగిపోయింది. ఐతే ఆ తర్వాత నుంచీ తమకు 5లక్షలూ,50సవర్ల (400గ్రాములు) బంగారమూ ఇవ్వాలని అడగటం మొదలు పెట్టటం తో. రమ్యకి ఆమె తల్లితండ్రులకీ వారిపై నమ్మకం పోయింది. దాంతో ఈ పెళ్ళి రద్దు చేసుకుంటున్నానీ డబ్బులిచ్చి కొనుక్కునే భర్త తనకు అవసరం లేదనీ తెగేసి చెప్పింది రమ్య.

దీంతో ముందునుంచే వరకట్నం విషయంలో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉన్న రమ్యా తన వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. ‘నేను భర్తను.. అతడి కుటుంబాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదు. నేను వరకట్నానికి పూర్తిగా వ్యతిరేకిని. మాట తప్పిన వారితో మాకు ఎలాంటి సంబంధం వద్దు. అందుకే నేను నా వివాహాన్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను’ అని ఆమె ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది. వరకట్న నిషేధ చట్టం 1961 సెక్షన్ 304బీ, 498 ఏ ప్రకారం భారత దేశం లో వరకట్నం తీసుకోవటం నేరం. అయినా పోలీసు అధికారులూ,రాజకీయ నాయకులే పెళ్ళిళ్ళ లో వరకట్నాలు కోట్ల సంఖ్యలో ముడుతున్నాయన్నది బహిరంగ రహస్యమే…

(Visited 198 times, 1 visits today)