Home / Inspiring Stories / మరణం అంచుల పై వేళ్ళాడుతూ నరకయాతన అనుభవించిన ఫ్రాన్స్ మహిళ

మరణం అంచుల పై వేళ్ళాడుతూ నరకయాతన అనుభవించిన ఫ్రాన్స్ మహిళ

Author:

paris attacks

అర్ధరాత్రి దాటే వరకూ పారిస్‌ నగరం బాంబుల మోత, కాల్పుల శబ్దాలతో వణికిపోయింది. పలు రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు ఉగ్రవాదులకు టార్గెట్‌గా మారాయి. కాల్పులు, ఉగ్ర తూటాలకు, బాంబు దాడులకు దాదాపు 140 మంది బలయ్యారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రదాడి అనంతరం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసివేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు దాడిలో తమ దేశీయులు ఇంతమంది ఒకేసారి మృత్యువాత పడటం ఇదే తొలిసారని ఫ్రాన్స్‌ పేర్కొంది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ శనివారం ప్రకటించింది…. ముంబయ్ తాజ్ హోటల్ తరహా లోనే ప్యారిస్ పారిస్‌లోని 11వ జిల్లా బతక్లాన్‌ థియేటర్‌ ఘటన్ కూదా జరిగింది…

అమెరికన్‌ బ్యాండ్‌ రాక్‌ మ్యూజిక్‌ వింటూ తమను తాము మైమరిచిపోయిన వందలాది ప్రేక్షకులు తేరుకునే తప్పించు కునేందుకు అవకాశమే లేకుండా చేసిన ఉగ్రవాదులు 100 మందిని బంధీలుగా పట్టుకొని మరీ బాబులు పేల్చి చంపారు. బతక్లాన్‌ థియేటర్‌ శవాల దిబ్బగా మారింది. కాల్పులు జరుపుతూనే దుండగులు లోనికి ప్రవేశించారని ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఐతే ఈ థియేటర్ లోనే సంగీతం వినటానికి వచ్చిన ఒక మహిళ. గర్భం తో ఉండి తననూ తన బిడ్డనూ రక్షించుకోవటానికి థియేటర్ రెండో అంతస్తు లోంచి దూకే ప్రయత్నం చేసింది కానీ. అదికూడా తనకు ప్రాణ హాని కలిగిస్తుందని అర్థమై. అలా కిటికీని పట్టుకొని వేళ్ళాడుతూనే ఉండిపోయింది. తనని కాపాడే వరకూ అలా ఆ కిటికీ నుండి వేళ్ళాడుతూనే ఉండిపోయింది. ఈ దృశ్యాన్నంతటినీ ఒక జర్నలిస్ట్ తన అపార్ట్ మెంట్ కిటికీ లోనుంచి వీడియో తీసాడు.

(Visited 61 times, 1 visits today)