Home / Latest Alajadi / తల్లి చనిపోయినా … కడుపులోని బిడ్డ బ్రతికే ఉంది !.

తల్లి చనిపోయినా … కడుపులోని బిడ్డ బ్రతికే ఉంది !.

Author:

ఒక తల్లి చనిపోయినా తన కడుపులో ఉన్న బిడ్డ బ్రతికిన ఘటన తెలిసి అబ్బుర పడుతున్నారు చికాగో ప్రజలు. ఒక ప్రమాదం జరిగి తల్లి చనిపోయినా, పాప మాత్రం సురక్షితంగా బయట పడటంతో పాపకు మిరాకిల్ అని పేరు పెట్టారు.

women-gave-birth-to-a-baby-after-death

పరాశబియర్డ్ అనే 19 సంవత్సరాల మహిళ తనకు పరిచయం ఉన్న ఒకవ్యక్తితో కలిసి తన ఇంటి బయట కారులో కూర్చొని మాట్లాడుతుంది… ఇంతలో గుర్తు తెలియని దుండగులు వచ్చి కారులో కూర్చున్న వారిపై విచక్షనరహితంగా కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో పరాశబియర్డ్ అక్కడికి అక్కడే చనిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని, పరిశీలిస్తున్న సమయంలో పరాశబియర్డ్ గర్భవతి అని తెలియడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్స్ చనిపోయిన మహిళ కడుపులో ఉన్న బిడ్డని బయటకు తీశారు. అలా తీసిన బిడ్డ బ్రతికే ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు….. తల్లి చనిపోయినా, బిడ్డకు నెలలు నిండక ముందే ఇలా ప్రాణాలతో సురక్షితంగా బయటపడినా ఆరోగ్యంగా ఉన్నాడు. పరాశబియర్డ్ తో కలిసి కారులో మాట్లాడుతున్న వ్యక్తి ఒక మాఫియా గ్యాంగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దానితో వీరిని చంపింది వేరే గ్యాంగ్ వారు అయి ఉంటారని పోలీసువారు తెలిపారు.

(Visited 294 times, 1 visits today)