Home / Inspiring Stories / లంచగొండికి కొత్త తరహాలో బుద్ధి చెప్పిన తమిళనాడు మహిళ.

లంచగొండికి కొత్త తరహాలో బుద్ధి చెప్పిన తమిళనాడు మహిళ.

Author:

ఒక వైపు భారతదేశం అభివృద్ధి చెందుతోంది అంటున్నారు కానీ నిజానికి ఎక్కువ స్పీడ్ గా అభివృద్ధి చెందుతుంది భారతదేశం కాదు మన దేశంలోని అధికారుల అవినీతి. ప్రభుత్వం టంచనుగా నెలకు జీతాలు ఇస్తున్నా కూడా తమ పని తాము చేయడానికి కూడా లంచం అడిగేఅధికారులు పెరిగిపోయారు. ఏ ఊరైతేనేమి, ఏ రాష్ట్రమైతేనేమి ఏమున్నది గర్వకారణం సమస్త దేశం అవినీతి పరం అన్నట్టు తయారైంది మన దేశం పరిస్తితి. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని  ఒక మహిళ చేసిన పని గురించి ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటుంది, ఇంతకు తను ఏం చేసిందంటే?

bribe demand

తమిళనాడులోని విల్లుపురం జిల్లా లోని ఆనత్తూరు గ్రామానికి చెందిన తొప్పయ్యన్‌ (55) గత సంవత్సరం ఆగస్టులో మరణించారు. పేదలు మరణిస్తే ఖర్చుల నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం కొంత డబ్బు చెల్లిస్తుంది. ఆ డబ్బుల కొరకు తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రంతో ఆయన కుమార్తె సుధ సమీప ప్రభుత్వ ఆఫీసులో దరఖాస్తు చేసింది. తండ్రి మరణించి ఏడాది కాలం ముగుస్తున్నా కర్మలకు ప్రభుత్వం అందించాల్సిన మొత్తం ఆమెకు అందలేదు. సంవత్సరం గడుస్తున్నా డబ్బు ఎందుకు చెల్లించలేదని ఆమే అధికారులకు చాలా ఆర్జీలు పెట్టుకున్నారు. అయితే ఎన్ని సార్లు వెళ్లినా, బతిమాలినా పని జరగలేదు. చివరికి అక్కడ అఫీసులోని గ్రామ నిర్వాహక అధికారి తమకు 3500 రూపాయలు లంచంగా చెల్లిస్తే తప్పా ప్రభుత్వం నుండు వచ్చిన డబ్బును ఇవ్వమని ఆమేకు తెగేసి చెప్పాడు.

చివరికి చనిపోయిన వారికి చెల్లించే డబ్బులలో కూడా లంచం అడిగిన ఆ అధికారులకు ఎలాగైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న సుధ జిల్లా కలెక్టరుకు దీని గురించి వివరంగా ఓ లేఖ రాశారు. ఆ కేఖ తో పాటు 2 వేల రూపాయల మనీ ఆర్డర్ కూడా పంపారు. ప్రభుత్వ సహాయం అందించాలంటే రూ.3,500 లంచం ఇవ్వాలని గ్రామ నిర్వాహక అధికారి డిమాండ్‌ చేశారని, ఆ మొత్తంలో మొదటగా రూ.2 వేల లంచం డబ్బు మీకు పంపుతున్నాను… మీరే మీ చేతులమీదుగా ఆ అధికారికి పంపిణీ చేయండి అని లేఖలో రాశారు. దీనిపై తగిన విచారణ జరిపిన కలెక్టర్ డాక్టర్. ఎల్. సుబ్రమణియన్ సదరు అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆ డబ్బులు కూడా సుధకు తిరిగిపంపమని ఆదేశించారు. దీంతో ఆ గ్రామం చుట్టుపక్కలవారు.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాగా లంచం కాటుకు మనియార్డర్ దెబ్బ అనే కొత్త సామతెను తెగ వాడేస్తున్నారట. లంచగొండికి కొత్త తరహాలో బుధ్ధి చెప్పిన సుధను అందరం అభినందించాల్సిందే.

(Visited 515 times, 1 visits today)