Home / Inspiring Stories / 200 ఏళ్ళ నాటి పడుపు వృత్తిలో… చెప్పలేని కష్టాలు.

200 ఏళ్ళ నాటి పడుపు వృత్తిలో… చెప్పలేని కష్టాలు.

Author:

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమా మీకు గుర్తుందా!…… ఆ సినిమాలో పోలీసులు ఒక వ్యక్తిని లేనిపోని దొంగతనం కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారు. అతని భార్య తన పిల్లలకి తిండి పెట్టడానికి డబ్బులు లేక 5 రూపాయల కోసం వ్యభిచారం చేస్తుంది….ఒక కానిస్టేబుల్ ఆమెని పట్టుకుని ఆమె దగ్గర ఉన్న 5 రూపాయలు లాక్కుంటాడు….సినిమా చూస్తున్నప్పుడు చాలా భాధగా ఉంటుంది… మరి నిజ జీవితంలో ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి .

prostitution in bangladesh

ఇప్పుడు ఇందంత దేనికి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నా, బంగ్లా దేశ్ ఈ పేరు మనకు పరిచయం అవసరం లేనిది ఎందుకంటే మన నుండి విడిపోయి మన పక్క దేశంగా ఉంటుంది.. ఈ  బంగ్లా రాజధాని ఢాకాకు కొద్ది దూరంలో ఒక ఊరులాంటి చిన్న ప్రదేశం ఉంది. అది ఒక బంగ్లా దేశ్ కు మాత్రమే కాదు దాదాపు ఇప్పుడు ప్రపంచానికి అంత తెలుసు కారణం అక్కడ నివసించేది కేవలం పడుపు వృత్తి( వ్యభిచారం) చేసుకునేవారు మాత్రమే. అక్కడ చాలా మంది జీవంలేని శరీరంతో బ్రతుకుతున్న బానిసలూ … సమాజం మాత్రం వేశ్యాలుగా గుర్తించింది. దాని పేరు కందపార దంతే వాడ. ఈ దంతే వాడ వేశ్యా వాటిక ఇక్కడ దాదాపు రెండు వందల సంవత్సరాల నుండి కొనసాగుతుంది. 2,000 మంది సెక్స్ వర్కర్లతో ఆసియా ఖండంలో అతి పెద్ద బ్రోతల్ ఏరియాల్లో ఇది ఒక్కటి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఇళ్ళు, విశాలంగా ఎటువైపు నుండైన గాలి వచ్చేంత పెద్దవిగా ఉండేవి ఒకప్పుడు.

prostitution in bangladesh2

ఇక్కడ  తర తరాలుగా ఇదే వృత్తి నమ్ముకుని పిల్లలు, మనుమరాళ్లు ఉన్న ఎంతొ మంది ఇక్కడ కనిపిస్తారు. అలాగే కొత్తగా వచ్చి చేరే ఆడవారితో ఎప్పుడు సందడిగా ఉండేది కానీ కొన్ని కారణాల వల బంగ్లా ప్రభుత్వం  ఇక్కడ  ఉండే ఇళ్ళన్ని కూల్చివేసింది. ఇక  ఇదే అదునుగా భావించి కొందరు  వీరి ఇళ్ళకు మంటలు పెట్టి కాల్చారు. దానితో రోడ్ పై జీవనం అయ్యింది వారి పరిస్థితి. వీరి భాగు కోసం చాలా అందోళనలు జరిగాయి అలాగే మహిళ న్యాయవాదులు కూడా చాలా మంది వీరికోసం ఉద్యమించారు… దాని ఫలితంగా బంగ్లా హైకోర్టు కందపారలో వ్యభిచారవృత్తికి చట్టబద్ధత చేసింది.

prostitution in Bangla

ఇంత  చేసిన ఉండటానికి ఇల్లులేక వారి ఇబ్బందిని చూసి  ఓ ఎన్ జీవో వీరి కోసం ఒక గృహ సముదాయాన్ని నిర్మించి ఇచ్చింది. ఆ సముదాయం మొత్తం రేకులతో ఉండటంతో ఉక్కపోతాలో వారి బ్రతుకులు చాలా హీనంగా ఉన్నాయి…..మన దేశంలో కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యంగా సోనాగచ్చి (కోల్ కతా- 11 వేల మంది సెక్స్ వర్కర్లు పనిచేస్తున్నారక్కడ), కామాటిపురా (ముంబై- 5,000 మంది), బుధ్ వార్ పేట్ (పుణే- 5000 మంది), మీర్ గంజ్ (అలహాబాద్), జీబీ రోడ్ (ఢిల్లీ), చతుర్భుజాస్థాన్ (ముజఫర్ పూర్), ఇట్వారీ (నాగపూర్), శివదాస్ పూర్ (వారణాసి). ఇప్పటికైనా ప్రభుత్వాలు వీరికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపి వారిని ఈ మురికికూపంనుండి బయటకు తీసుకువస్తే బాగుంటుంది.

(Visited 7,406 times, 1 visits today)