Home / Inspiring Stories / మహారాజశ్రీ ‘బిగ్ బీ’ కి…తపాల శాఖ శతకోటి వందనాలు..!

మహారాజశ్రీ ‘బిగ్ బీ’ కి…తపాల శాఖ శతకోటి వందనాలు..!

Author:

మహారాజశ్రీ అమితాబ్ బచ్చన్ తాత గారికి..మీ మనుమరాలు ఆరాధ్య వేనకువేల నమస్కారాలతో …అంటూ చిట్టి చిట్టి చేతులతో అప్పుడే అక్షరాలు నేర్చుకునే వయసులో తన మనుమరాలు ఒక లెటర్ రాస్తే..అది రెసీవ్ చేసుకున్నప్పుడు బిగ్ బీ పొందే ఆనందం ఎలా ఉంటుంది ..వర్ణనాతీతం కదా……ఆ లెటర్ అందుకోగానే మురిసిపోతూ అమితాబ్ తన కుమారుడు అభిషేక్ కు ఒక లేఖ రాస్తూ..తానెంత ఆనందానికి లోనైందీ వివరిస్తారన్న మాట. పురాతన తపాలా వ్యవస్థ ను సాంతం ఎరిగి ఉన్న అమితాబ్ బచ్చన్…వరల్డ్ పోస్టల్ డే సందర్భంగా తన ఫేస్ బుక్ పేజ్ మీద ఫోటో సహా చేసిన పోస్టింగ్ ఎంతో బావుంది కదా.  అలాగే జంధ్యాల సినిమా “శ్రీవారికి ప్రేమలేఖ” చూశారుగా ….అందులో హీరోయిన్ పూర్ణిమ హీరో కి రాసిన ఇక లెటర్ చుట్టూతా అల్లిన ఒక చక్కని జానకి పాట  కూడా మనకి గుర్తుకు వస్తుంది. అలాగే ..ప్రియతమా నీవచ్చట కుశలమా..అంటూ “గుణ” సినిమాలో……ప్రియురాలికి ప్రియుడు రాసిన లేఖ సందర్భంగా ఒక అద్భుతమైన సాంగ్…వందల , వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చే ఆ తొకలేని పిట్ట కోసం ఆతృతగా ఎదురుచూసి ” పోస్ట్ ” అన్న కేక వినగానే ఉరుకులు , పరుగులతో అందుకునే ఉత్తరాల్లొ ఎన్నోవిశేషాలు , అనేక కమ్మని కబుర్లు , కెరీర్ కు బాటలు …. మంచి ఉత్తరము అందుకున్నప్పుడు కలిగే సంతోషము అంతా ఇంతా కాదు . అలాగే మనియార్డర్లు .. ఈ సంతోషము తోనే పోస్ట్ మ్యాన్‌ కు ఈనాము ఇచ్చే ఆనవాయితీ నెలకొని పోయింది. గతం లో సమాచార మార్పిడికి , క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే(ఉత్తరము) ప్రధాన ఆధారం . పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనం లో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడ కోసం పొరాడుతోంది. సెల్ ఫోన్లు , కంప్యూటర్లు , ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయింది. ఇ-మెయిల్స్ చాలా వరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు .

చరిత్ర లోకి వెళితే మెసెంజర్ల రూపములో తపాలా సర్వీసులుండేవి . వీళ్లు నడిచి లేదా గుర్రాలమీద వెళ్ళి వ్రాత ప్రతుల్ని అటూ ఇటూ చేరవేసేవారు . 1600 – 1700 సంవత్సరాలలో అనేక దేశాలవారు జాతీయ తపాలా వ్యవస్థ లను నెలకొల్పుకొని ఆయాదేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని అందించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు . 1800 సంవత్సరము నాటికి ఇలా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నవారు భారీగా తేలారు . దీంతో అంతర్జాతీయ తపాలా పంపిణీ క్లిష్టం గా, అసంపూర్తిగా , అసమర్ధవంతం గా మారిపోయింది .

అమెరికాకు చెందిన పోస్ట్ మాస్టర్ జనరల్ మాంట్ గోమెరి బ్లెయిర్ 1863 లొ 15 యూరొపియన్‌ దేశాలు , అమెరికన్‌ దేశాల ప్రతినిధులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సదస్సు లో అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులపై పరస్పర ఒప్పందాలకోసం ప్రతినిధులు అనేక సాధారణ సూత్రాల్ల్ని వెల్లడించారు . కాని ఒక అంతర్జాతీయ ఒప్పందము అయితే మాత్రము కుదరలేదు . 1874 లో నార్త్ జర్మన్‌ కాంఫెడరేషన్‌ కు చెందిన ఓ సీనియర్ పోస్టల్ అధికారి హెయిన్‌రిచ్ బనీ స్టీఫెన్‌ స్విట్జర్లాండ్ లోని బెర్నె లో 22 దేశాల ప్రతినిధులతో ఒక సదస్సు ఏర్పాటు చేశాడు.ఆ ఏడాది అక్టోబరు తొమ్మిదో తీదీన ప్రతినిధులు బెర్నె ఒప్పందం పై సంతకాలుచేసి జనరల్ పోస్టల్ యూనియన్‌ ను నెలకొల్పారు . ఈ యూనియన్‌ లో సభ్యదేశాలు క్రమముగా పెరుగుతూ రాగా యూనియన్‌ పేరు 1878 లో యూనివర్షల్ పోస్టల్ యూనియన్‌ గా మారింది . ఇది 1948 లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక ఏజెన్‌సీగా రూపాంతరం చెందినది . 1969 లో అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వ తేదీవరకు జపాన్‌ టోకియో లో 16 వ యూనివర్షల్ పోస్టల్ యూనియన్‌ కాంగ్రెస్ ను నిర్వహించారు . ఈ కాన్ఫరెన్స్ లో ప్రతినిధులు అక్టోబరు 9 వ తేదీన ” వరల్డ్ పోస్టల్ డే” ని నిర్వహించాలని తీర్మానించారు .

పోస్టల్ డే ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశము … ప్రపంచ వ్యాప్తం గా సందేశాల్ని సౌకర్యము గా పంపుకునే యంత్రాంగాన్ని ఒక దాన్ని సృస్టించడ మే . అంతర్జాతీయ లేదా జాతీయ పోస్టల్ సర్వీసుల ప్రగతి లేదా చరిత్ర పై ప్రపంచ దేశాలు , మంత్రులు , సంస్థలు , అత్యున్నత స్థాయి అధికారులు ఈ రోజున ప్రకటనలు ఇస్తారు లేదా ప్రసంగాలు చేస్తారు . పోస్టల్ సర్వీసులు చరిత్ర , అభివృద్ధి ని తెలియచేస్తూ ప్రత్యేక తపాల బిళ్లలను విడుదలచేయవచ్చు , యునెస్కో సహకారము తో గడిచిన 35 సంవస్తారాలుగా యూనియన్‌ యువతకు లెటర్ రైటింగ్ లొ ప్రపంచ పోటీల్ని నిర్వహిస్తూ వస్తోంది. విజేతలకు బహుమతులు ఇస్తూ ఉన్నారు . . వరల్డ్ పోస్ట్ డే అన్నది పబ్లిక్ హాలిడే కాదు కాబట్టి ప్రజలు దీనివల్ల ఏమాత్రము ప్రభావితం కారు . పోస్టల్ సర్వీసులు యధాతధంగానే గానే ఉంటాయి ఇప్పటికి 150 దేశాలకు పైగా సభ్యత్వమున్న “యూనివర్సల్ పోస్టల్ యూనియన్” 1874 సంవత్సరం లో ‘బెర్న్’ నగరములో ఏర్పాటైంది.
1969 లో టోక్యో లో జరిగిన మహా సభలో “యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ” స్థాపనా దినమైన అక్టోబర్ 9 ని  ‘ప్రపంచ తపాలా దినోత్సవం’ గా పరిగణించాలని నిర్ణయించారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ లో సభ్యత్వం కలిగిన దేశాలలో ఈ రోజున  ‘వర్కింగ్ హాలిడే ‘ గా అనేక కార్య క్రమాలు నిర్వహిస్తారు. సమావేశాలు, వర్క్ షాప్ లు , సంస్కృతిక కార్య క్రమాలు, ఆటల పోటీలు జరుగుతాయి. ఆయా దేశాలలో పోస్టల్ శాఖల ద్వారా కొత్త ప్రాడక్ట్స్ , కొత్త సేవలు ప్రారంభమవుతుంటాయి. తపాల సేవల గురించి ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయడం తో పాటు రకరకాల సావనీర్లు విడుదల చేస్తారు. తపాల శాఖలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని సత్కరిస్తారు.

ఉత్తరం ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలో మార్పులను అందిపుచ్చుకుంటూ మనుగడను కొనసాగిస్తూనే ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది భారత తపాలశాఖ. పావురాల ద్వారా బట్వాడానుంచి.. స్పీడుపోస్టు.. ఈ-మెయిల్‌ ఇలా దూసుకెళ్తున్న భారత తపాలవ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని మూటగట్టుకుంది. ఉత్తర ప్రత్యుత్తరాల వారధులుగా అశేష సేవలందిస్తున్న ఈ విభాగం ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.. ప్రైవేట్‌ రంగం నుంచి వచ్చిన పోటీని తట్టుకొని నిలబడుతోంది. అక్టోబర్‌ 9న ప్రపంచ తపాలశాఖ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఆశాఖ తీరుతెన్నులు.
తపాలశాఖ గతంలో ఉత్తరాలు బట్వాడాకే పరిమితంకాగా కాలక్రమంలో అనేక సేవల్లోకి మారింది. ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు లక్షల మంది తపాల సిబ్బంది 1.10లక్షల కార్యాలయాలతో సేవలందిస్తోంది. దేశంలో రైల్వే తర్వాత ఇదే అతి పెద్ద వ్యవస్థ. చివరగా చదువరుల ను ఆహ్లాదం లోకి తీసుకెళ్ళడం కోసం …నటి శ్రీలక్ష్మి ఒక సినిమా లో పోస్ట్ మ్యాన్ తో జరిపిన హాస్య స్ఫోరక సంభాషణ ల సన్నివేశాన్ని ఇక్కడిస్తున్నాం.

(Visited 79 times, 1 visits today)