Home / Entertainment / సాహసం ఉన్న డైరెక్టర్ తో అవార్డ్స్ హీరొ

సాహసం ఉన్న డైరెక్టర్ తో అవార్డ్స్ హీరొ

Author:

Mohanlal

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిది ఓ ప్రత్యేక శైలి. ప్రయోగాత్మక సినిమాలను కమర్షియల్‌గానూ వర్కవుట్ అయ్యేలా చేస్తూంటాడు. తన మొదటి సినిమా ‘ఐతే’ తర్వాత ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’లాంటి వినూత్న సినిమాలను అందించిన యేలేటి, తాజాగా ఓ బహుభాషా సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత, 2001 పద్మశ్రీ పురస్కార గ్రహీత మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందనున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఉహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘తుంగభద్ర’ వంటి హిట్ చిత్రాలను అందించిన వారాహి చలన చిత్రం అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన ఈ సినిమా ను నిర్మించనున్నారు. ఓ ఫ్యామిలీ ఓరియంటడ్ కథాంశంతో సరికొత్త నెరేషన్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఇక స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నామని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక మోహన్ లాల్‌తో ఈ ప్రాజెక్టు విషయమై సంప్రదింపులు జరిపే క్రమంలో ఆయనతో కలిసి తీయించుకున్న ఓ ఫోటోను సాయి కొర్రపాటి షేర్ చేస్తూ, మోహన్‌ లాల్‌తో కలిసి పనిచేయడం సంతోషాన్నిస్తోందని తెలిపారు.

sai korripati

ఇక తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఈ సినిమా కన్నడ వర్షన్‌లో మోహన్ లాల్ స్థానంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్‌ను నటింపజేస్తున్నారు. శివ రాజ్ కుమార్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కిల్లింగ్ వీరప్పన్‌లో నటించిన విషయం తెలిసిందే. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్‌లతో పాటు బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ లాంటి స్టార్స్ నటిస్తోన్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమా అనౌన్స్ అయినరోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి.త్వరలోనే షుటింగ్ మొదలు పెట్టనున్నారు.

(Visited 75 times, 1 visits today)