Home / Inspiring Stories / నగరంలో పెను విధ్వంసం

నగరంలో పెను విధ్వంసం

Author:

నిన్న వచ్చిన ఈదురుగాలులతో హైదరబాద్ నగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఉరుముల మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. కొద్ది క్షణాలలోనే వాతవరణం ఒక్కసారిగా మారిపోయింది. తూఫాన్ ప్రభావంతో  ఈదురుగాలుల వర్షం పడుతోంది.

Hyderabad yesterday rain

 

నిన్న వచ్చిన ఈదురుగాలుల వర్షానికి నగరంలో చాలా చోట్లా భారీ చెట్లు నేలకూలాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. మాములు వర్షానికే నగరంలో భారీ ట్రాఫిక్ జాం అవుతుంది. మరి ఇంత భారీ వర్షానికి సిటీలోని చాలా ప్రాంతాల్లో చాలా ట్రాఫిక్ జాం అయ్యింది. ఇక ఉరుములు, మెరుపులతో విద్యుత్ శాఖ అలెర్ట్ అయ్యింది, కాబట్టి కొంత మేలు జరిగింది, లేకపోతే నిన్న చాలా పెను ప్రమాధమే జరిగేది. విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా కూకట్ పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

Strong gales, heavy rain in Hyderabad

చాలా చోట్ల హోర్డింగ్ లు విరిగి పడటంతో చాలా కార్లు ద్వంసం  అయ్యాయి. అలాగే చాలా చోట్లా ఇళ్ళ పై కప్పులు ఎగిపోవడంతో చాలా మంది బిక్కు బిక్కుమంటు  రాత్రంత గడిపారు. నగరంలో చాలా చోట్ల విరిగిన విధ్యుత్ స్తంబాలు, చెట్లు రోడ్ కి అడ్డంగా  ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు  పడుతున్నారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

(Visited 1,046 times, 1 visits today)