Home / Latest Alajadi / పెళ్లి ఉందని ఎస్పీతో లెటర్ తీసుకువస్తే 5 లక్షలు బ్యాంక్ లో ఇస్తారనే వదంతులు నమ్మొద్దు – పోలీసులు.

పెళ్లి ఉందని ఎస్పీతో లెటర్ తీసుకువస్తే 5 లక్షలు బ్యాంక్ లో ఇస్తారనే వదంతులు నమ్మొద్దు – పోలీసులు.

Author:

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా ఇప్పుడు బ్యాంకుల వద్ద, ఏటీఎమ్స్ వద్ద క్యూలలో నిలబడి ఉన్నారు. పెళ్లిళ్లు ఉన్నవారు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. చివరికి వధువు, వరుడు కూడా వచ్చి క్యూలో నిలబడి మరి డబ్బులు కోసం పడిగాపులు కాస్తున్నారు. పెళ్లి ఖర్చులకు డబ్బులు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందో అని బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఒక వాట్సాప్ మెసేజ్ చూసి పోలీసుల వద్దకు వెళ్తున్నారు.

you-cant-withdraw-five-lakhs-with-sp-letter

ఎవరైతే పెళ్లి చేసుకునే వారు ఉన్నారో వారు పెళ్లి కార్డుని తీసుకోని జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్లి వారి నుండి ఒక లెటర్ తీసుకోని బ్యాంక్ అధికారికి చూపిస్తే మీరు ఐదు లక్షల వరకు విత్ డ్రా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కలిపిస్తుంది….అంటూ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లలో ఈ మెస్సేజ్ హల చల్ చేస్తుంది. అసలే అనేక ఇబ్బందులలో ఉన్న పెళ్లి వారికి ఈ విషయం ఆశగా కనిపించడంతో చాలా మంది ఎస్పీ ల వద్దకు పెళ్లి కార్డ్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఈ విషయమై పై అధికారుల నుండి జిల్లా ఎస్పీ లకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో, ఈ తప్పుడు వార్తను ఎవరో కావాలనే సృస్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు…వచ్చిన వారికి సర్ది చెప్పి పంపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేసారు. ఈ మధ్యనే ఉప్పు, పప్పు ధర పెరుగుతుందని ప్రజలలో లేని భయాన్ని కలిపిస్తూ ఆందోళన చెందే విధంగా చేస్తున్నారు ఆకతాయిలు… ఇలాంటి వార్తలను నమ్మే ముందు ఒక్కసారి నిజామా కాదా! అని నిర్దారించుకోవాలని పోలీసులు సూచించారు.

(Visited 906 times, 1 visits today)