Home / Inspiring Stories / ఆధార్ కార్డుతో 7 రోజుల్లో పాస్ పోర్ట్ పొందొచ్చు.

ఆధార్ కార్డుతో 7 రోజుల్లో పాస్ పోర్ట్ పొందొచ్చు.

Author:

Passport in 7 days

విదేశాలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్ పోర్ట్ కావాలి, ఇంతకు ముందు పాస్ పోర్ట్ రావాలంటే డాక్యుమెంట్స్ అని, పోలీస్ వెరిఫికేషన్ అని చాలా  సమయం పట్టేది, అప్లై చేసిన 2,3 నెలలకి గాని వచ్చేది కాదు, ఇంకా పోలీస్ వెరిఫికేషన్ అని వచ్చేవాళ్ళకి 1000/- నుండి 3000/- వరకు లంచం ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు ఇలాంటి కష్టం ఏమి లేకుండా అప్లై చేసిన 10 రోజులలోనే పాస్ పోర్ట్ ని పొందవచ్చు.

ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే 10 రోజుల్లో పాస్‌పోర్టు మీ చేతిలో ఉంటుంది. ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానం చేశారు.ఈ రోజులలో పాస్‌పోర్టుల జారీ విషయంలో పోలీసు వెరిఫికేషన్ అనేది చాలా ఆలస్యం అవుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పద్దతిలో పాస్ పోర్ట్ కావాలనుకోనేవారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.అలాగే గుర్తింపు కార్డ్ తో పాటు అడ్రస్స్ కింద ఆధార్ కార్డు తప్పనిసరి.పాస్ పోర్ట్ కి అప్లై చేసిన వారి పౌరసత్వం, నేర చరిత్రని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ అండ్ బ్యూరో డేటా బేస్ లో ఆధార్ కార్డు నెంబర్ ద్వారా తెలుసుకుంటారు, దీని కోసం విదేశీ మంత్రిత్వ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, పోలీస్ డిపార్టుమెంటు సమన్వయంతో పని చేస్తాయి.

పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకున్న మూడు అంటే  మూడు రోజుల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అప్పాయింట్మెంట్ వస్తుంది, అలాగే మరో ఏడు రోజుల్లో, పాస్‌పోర్ట్‌ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత పోలీసు ఎంక్వైరీ ఖచ్చితంగా అవసరం అయితే ఇంటికి వస్తారు. పాస్‌పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసేందుకు యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటుంది.

Click Here: Passport Application.

Must Read: మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉందా? అయితే మీకో శుభవార్త.

(Visited 18,240 times, 1 visits today)