Home / Inspiring Stories / చాయ్ అమ్ముకుంటూ 24 పుస్తకాలను రాసిన చాయ్ వాలా….!

చాయ్ అమ్ముకుంటూ 24 పుస్తకాలను రాసిన చాయ్ వాలా….!

Author:


ఒక చాయ్ వాలా ఏం చేయగలడు? “చాయ్ వాల ఏం చేస్తాడు..! చాయ్ చేయగలడు” ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..!? భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకప్పుడు చాయ్ వాలా అంటారు.మరి ప్రధాని సృష్టించిన చరిత్ర ఏమిటో మనకూ తెలుసు.. ఒక చాయ్ వాలా చాయ్ మాత్రమే కాదు ఇంకా చాలానే చేయగలడు. అతను చేసే పనిని బట్టీ అతని ఙ్ఞానాన్నినిర్ణయించే సమాజం లో ఇలాంటి మనుషుల కథ కాస్త చిత్రంగానే అనిపించొచ్చు కానీ… ఇదీ నమ్మాల్సిన నిజం. లక్ష్మణ రావ్ దేశరాజధాని డిల్లి లో రోడ్డు పక్క టీ అమ్ముతూంటాడు పక్కనే చిన్న గొడుగుకింద కొన్ని పుస్తకాలని కూడా అమ్ముతాడు.టీ అతను తయారు చేసిందే అంతే కాదు ఆ పుస్తకాలూ అతను రాసినవే ఒకటీ రెండూ కాదు నవలలూ,కథలు కలిపీ మొత్తం 24 పుస్తకాలని అతను ప్రచురించాడు.వీటిలో కొన్ని బెస్ట్ సెల్లర్స్ కూడా.1952 లో మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలో పుట్టిన లక్ష్మణ్ కి చిన్నప్పటి నుంచే తానో రచయిత అవ్వాలనే కోరిక ఉండేదట. కానీ ఆర్థిక పరిస్తితులు అతన్ని చాయ్ వాలాని చేసాయ్. రాసిన పుస్త కాలని పబ్లిషర్లకి చూపిస్తే పెదవి విరిచారు. ఎవరూ వాటిని అచ్చు వేసేందుకు ముందుకు రాకపోవటం తో తానే భారతీయ సాహిత్య కళా ప్రకాషణ్ అనే పబ్లికేషన్ ని మొదలు పెట్టి తానే పుస్తకాలని అచ్చు వేయించుకున్నాడు.

Indian tea-seller who hawks his books on Amazon 1

 

మొదటి నవల “నయీ దునియా కీ నయీ కహాని” (కొత్త ప్రపంచపు కొత్త కథ) బాగానే అమ్ముడు పోయింది. కానీ ఖర్చు మొత్తం తన టీ అంగడి రాబడే అవటం తో మరిన్ని సమస్యలు. అయినా ఆగలేదు ఒకటి తరవాత ఒకటి గా మొత్తం 24 పుస్తకాలనీ అచ్చు వేయించాడు. తన టీ స్టాల్ పక్కన అమ్మటమే కాదు ఇప్పుడు తన పుస్తకాలని ఆన్ లైనె లో కూడా అమ్ముతున్నాడు…

ఎవరైనా ఈ టీ మాస్టర్ సాహిత్యాన్ని కూడా రుచి చూడాలనుకుంటే ఈ లింక్ ఫాలో అవ్వొచ్చు… Amazon.in/Laxman Rao Books

 

(Visited 134 times, 1 visits today)