Home / Inspiring Stories / ప్రపంచం పైకి దండెత్తనున్న జికా వైరస్

ప్రపంచం పైకి దండెత్తనున్న జికా వైరస్

Author:

Mosquitos

కొన్నేళ్ళ క్రితం వరకూ ప్రపంచాన్ని వణికించింది స్వైన్ ఫ్లూ హెచ్1ఎన్1 అనే వైరస్.  స్వైన్ ఫ్లూ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోయాయి. స్వైన్ ఫ్లూ దాడికి గురై అనేక మరణాలు సంభవించిన దేశాల్లో భారత దేశం కూడా ఒకటి. ఇప్పటికీ స్వైన్ ఫ్లూ వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.ఈ స్వైన్ ఫ్లూ బారినుంచి కొద్దిగా బయట పడి ఊపిరి తీసుకుందో లేదో వెంటనే ఎబోలా వైరస్ విజృంబించింది ఆఫ్రికా దేశాల్లో కొన్ని వందల మందిని బలి తీసుకుందీ ఈ వైరస్. అదే క్రమం లో ఇప్పుడు జికా వైరస్ అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ వైరస్ పూర్తి ప్రపంచాన్ని ఆక్రమించేందుకు పెద్దగా సమయం పట్టక పోవచ్చు. ఇటీవలి కాలంలో జికా వైరస్ వల్ల వ్యాపించే వ్యాది ‘మైక్రోసెఫాలీ’ కారణంగా బ్రెజిల్ లోనే 2,400కు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. పెర్నంబుకో రాష్ట్రంలో ఈ సమస్య అధికంగా వుందని కుడా గుర్తించారు. 2007 లో యాప్ దీవుల్లో జికా ప్రబలింది. తరువాత 2013 లో , ఫ్రెంచ్ పోలీనేసియా, తహీతి ప్రాంతాలకు పాకింది. అక్కడ దాదాపు 28,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు ఈ జికా బ్రెజిల్ చేరింది. ఈ పరిణామాలకు స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.

Mosquito

ఈ వైరస్ ప్రభావం ఇప్పటికే ఎదిగిన మనుషుల మీద మాత్రమే కాదు గర్భస్త పిండాల మీద కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ వైరస్ కారణం గా వచ్చే వ్యాదిని ‘మైక్రోసెఫాలీ’ గా పిలుస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా ఆడవుల్లోని వానరాలల్లో గుర్తించిన ఈ వైరస్ వున్న దోమ గర్బంతో వున్న తల్లిని కుడితే, ‘మైక్రోసెఫాలీ’ వ్యాధి సోకి ఆ ప్రభావంతో చిన్నారుల పుర్రెలు కుంచించుకుపోతాయి. నరాల బలహీనత కుడా సంభవిస్తుంది. ఒక్కోసారి పరిస్థితి విషమించి మరణం సంభవిస్తుంది. గత నెల 28న ఒక చిన్నారి మృతదేహాన్ని పరీక్షించినప్పుడు ఈ మైక్రోసెఫలీ వెలుగులోకి వచ్చింది. వైరస్ కారణంగా మెదడు కుచించుకుని పోతుంది. మైక్రోసిఫలీ వల్ల నరాల సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతాయని, అందుకే మహిళలు ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచనను విరమించుకోవాలని అక్కడి ప్రభుత్వాధికారులు కోరుతున్నారు.

జీవి, నిర్జీవి కానీ ఒక మాధ్యమిక విష రసాయనం ఈ వైరస్. ఇపుడీ ఈ అతిచిన్న పదార్థం మొత్తంగా సృష్టి నిర్మాణాన్నే శాసిస్తుంది.సృష్టి ఆది నుంచి ఉన్న ఈ పదార్దం రోజు రోజుకు తన రూపాన్ని మార్చుకుంటూ మానవ విజ్ఞానానికే సవాలుగా నిలిచింది. రానున్నకాలంలో మానవజాతి మొత్తాన్ని తుడిచి పెట్టే వైరస్ పుట్టుకొచ్చినా ఆశ్యర్యం లేదు. ఐతే ఇక్కడ మానవ తప్పిదమూ లేకపోలేదు.., మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలను కాలుష్యం చేయడం విపరీతంగా రేడియో థార్మిక పదార్ధాలు ఉపయోగించడం వలన కొత్త జాతుల వైరస్లు ఉత్పరివర్తనాల వలన పుట్టుకొస్తున్నయి. ఏదో ఒక రోజు ఇవి పెరిగి పెరిగి భూగోళం పై జీవనాన్ని ప్రశ్నార్ధకంగా మార్చినా ఆశ్చర్యంలేదు.

(Visited 434 times, 1 visits today)