Home / Inspiring Stories / భారత్ కనెక్ట్ అయితే తప్ప ప్రపంచంతో కనెక్ట్ కాలేం అంటున్న పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్

భారత్ కనెక్ట్ అయితే తప్ప ప్రపంచంతో కనెక్ట్ కాలేం అంటున్న పేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్

Author:

Zuckerberg In IIT-DELHI, Says Can’t Connect The World Without Connecting India

ఫేస్బుక్ను వినియోగిస్తున్న ప్రతి పది మందిలో ఒకరికి ఉద్యోగం వస్తున్నదని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఆయన బుధవారం ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భారత్లో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. భారత్లో 13 కోట్ల మంది ఫేస్బుక్ను వినియోగిస్తున్నారని, అత్యధిక ఫేస్బుక్ వినియోగదారులతో భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండోస్థానంలో ఉందని చెప్పారు.

భారత్తో అనుసంధానమైతేనే ప్రపంచంతో అనుసంధానం కావచ్చునని ఆయన పేర్కొన్నారు. మరో వందకోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రౌండ్ నెక్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటు వేసుకొని సింపుల్గా ఈ కార్యక్రమానికి హాజరైన జుకర్బర్గ్.. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఉత్సాహంగా సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ఆయన చెప్పిన జవాబులివి..

ప్రశ్న: మీరు ఎందుకు భారత్ పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు? నిజాయితీగా చెప్పండి?
జవాబు: ప్రపంచంలోని ప్రతి ఒక్కరితో అనుసంధానం కావాలన్నది మా మిషన్. భారత్ అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంతో కనెక్ట్ అయితే తప్ప ప్రపంచంతో కనెక్ట్ కాలేం.

ప్రశ్న: ప్రస్తుతం ఫేస్బుక్లో భారత్ నుంచి 13 కోట్ల మంది యూజర్లు ఉన్నారు సరే, మరీ ఇంటర్నెట్ సదుపాయం లేనివారితో మీరెలా అనుసంధానం అవుతారు?
జవాబు: ఇందుకోసం ఇంటర్నెట్.ఓఆర్జీ ద్వారా మేం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే 24 దేశాల్లో ఇది ప్రారంభమై విస్తరిస్తున్నది. ఇంటర్నెట్.ఓఆర్జీ ద్వారా చేస్తున్న ప్రయత్నాలతో ఇప్పటికే కోటిన్నరమందికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సెనెగల్ లాంటి ఆఫ్రికన్ దేశాలలో కూడా ఇప్పుడు ఫేస్‌బుక్ అందుబాటులో ఉంది.

(Visited 151 times, 1 visits today)