Home / Inspiring Stories / మమ్మల్ని క్షమించు ఫాతిమా.

మమ్మల్ని క్షమించు ఫాతిమా.

Author:

5 year old girl killed after crushed in school lift

ఆ చిన్నారి దాదాపు ఇరవై నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. ఒక్కొక్క క్షణం తన ప్రాణాలతో పోరాడింది ఒక పసి ప్రాణానికి మన ఇచ్చే రక్షణ పై ఉమ్మేస్తూ చచ్చిపోయింది.. ఇది ఒక్క ఫాతిమా జాఫ్రి మరణమేనా. కాదేమో ఈ చావు నైతికం గామనందరిది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ లిఫ్ట్ సరిగా పని చేయడం లేదు. అంతేకాదు, దానికి లిఫ్ట్ బాయ్ కూడా లేడని చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం ఆ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. దిల్‌సుఖ్ నగర్ పరిధిలో నర్సరీలో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

లిఫ్ట్ కదులుతుండగానే డోర్ తెరిచి ఉన్న  చోటు నుంచి ఫాతిమా జాఫ్రీ లిఫ్టుకు, గోడకు మధ్య ఇరుక్కుపోయింది. ఆమె తల లిఫ్టు అడుగు భాగానికి, గోడకు మధ్య చిక్కుకుపోయింది. చిక్కుకున్న ఆమె తలను రాసుకుంటూ లిఫ్టు మొదటి అంతస్తు వరకు వచ్చి ఆగిపోయింది. అప్పటికే లోపల ఉన్న తోటి చిన్నారులు, టీచర్ కేకలు వేయడంతో.. కింద ఉన్న సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పైకి చేరుకున్నారు. లిఫ్టు డోర్‌ను తెరిచి లోపల ఉన్న మిగతా చిన్నారులను, టీచర్‌ను బయటకు తీశారు. కానీ ఫాతిమా జాఫ్రి తల ఇరుక్కుపోయి ఉండడంతో పైకి తీయలేకపోయారు. అదే స్థితిలో దాదాపు 20 నిమిషాలపాటు ఊపిరాడక గిలగిలా కొట్టుకున్న చిన్నారి.. చివరికి ప్రాణాలు వదిలింది. లిఫ్టుకు, గోడకు మధ్య నలిగి పోవడంతో చిన్నారి ముఖం రక్తసిక్తమైంది.

అసలు స్కూల్ ని చూసిన వారికి వారు ఏమాత్రం నిబందనలకు లోబడి పాఠశాలని నిర్వహించలేదన్న విషయం అర్థమైపోతోంది. నగరాల్లోని 90% స్కూళ్ళు ఆట స్థలం లేకుండానే, నిబందనల ప్రకారం గదుల వైశాల్యం లేకుండానే నిర్వహించబడుతున్నాయి. మరి తల్లి తండ్రులకు ఆ విషయం తెలియదా అంటే తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విధ్యలేకపోవటం వల్లే ప్రైవేటు స్కూల్ల వైపు చూస్తున్నామనేది వారి మాట. ఐతే వందల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో లేని సౌకర్యాలు మామూలు కోటీ రెండుకోట్ల వ్యయం తో స్థాపించే ప్రైవేటు స్కూల్లలో ఎలా ఉంటున్నాయి? మామూలు పౌరునికి కూడా కనిపించే లోపాలు అధికారులకు మాత్రం ఎందుకు కనిపించటం లేదు. స్కూలు బస్సులో ప్రయాణించే పిల్ల లు అనేకసంధర్బాల్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు విదుస్తున్నారు… ప్రభుత్వ పాఠ శాలల నిర్వహణ సరిగ్గా ఉంటే అసలిన్ని ప్రైవేటు పాఠ శాలల అవసరం ఉండదు కదా…! ఇది ప్రభుత్వ వైఫల్యం కాక మరేమిటి…? ఇన్ని ప్రశ్నల్లో ఒక్క దానికి సమాధానం దొరికినా ఇకముందైనా మరికొందరు పిల్లలు చని పోకుండా ఆపొచ్చు.

కనీస సౌకర్యాలు కల్పనపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులు కనుచూపు మేరకు అమలు కావడం లేదు. వాటిని సమర్దంగా అమలు చేయాల్సిన విధ్యాశాఖ అధికారులు కళ్లుమూసు కుంటున్నారు. ప్రభుత్వ నిబందనలు పకడ్బదిగా అమలు చేయాల్సిన అధికారులు ప్రైవేటు పాఠశాల వారికి చుట్టాలుగా మారి పోయారు. దాంతో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాఠగా మారింది. విధ్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో జూన్‌ 25 తేదీలోపు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు బోర్డుపై ఉంచాలి, వారి విధ్యా అర్హహతలు, వేతనాలు, శిక్షణ పొందిన వివరాలు, పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతులు వివరాలు, విధ్యార్థుల సంఖ్య, ఫీజుల వివరాలు, నోటీస్‌ బోర్డుపై ఉంచాలి. ఈ ఉతర్వులో గతంలోనే విధ్యాశాఖ అధికారులు జారీ చేసినా ఇంత వరకు ఏ ఒక్క పాఠశాల వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులూ వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు…

Must Read: ఉగ్రవాద భూతం సృష్టి లో ఎవరి పాపం ఎంత…!?

(Visited 131 times, 1 visits today)