Home / Inspiring Stories / ఉగ్రవాద భూతాన్ని కన్నదెవరు.

ఉగ్రవాద భూతాన్ని కన్నదెవరు.

Author:

Article On ISIS

2001 న్యూయార్క్ మీద ఉగ్రవాద దాడి జరిగింది. దాడుల్లో సుమారుగా 3,000 మంది పౌరులతో పాటు 19 మంది హైజాకర్లు మరణించారు. వారే కాదు సహాయ రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన దాడుల్లో దుర్మరణం పాలైన 2,752 మంది బాధితుల్లో 343 మంది అగ్నిమాపకదళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం మరియు పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో అధికులు సాధారణ పౌరులే. వారిలో 70కి పైగా ఇతర దేశాలకు చెందిన వారూ ఉన్నారు.దీని వెనక ఉన్నది ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ అనీ దాని మూల స్థంభం  ఓసామా బిన్ లాడెన్ అనీ తెలిసిన అమెరికా అవాక్కయింది. ఐతే మరణించిన వారిలో ఒక్కరు కూడా ఆఫ్ఘన్ కి ద్రోహం చేసినవారు లేరు.

Article On ISIS

సోవియట్ యూనియన్ ను అస్థిర పరచాటానికి ఆఫ్ఘనీస్థాన్ లో “ఆల్ ఖైదాను సృష్టించింది అమెరికా. ప్రపంచ వ్యాపితంగా ఈ ఉగ్రవాద ముఠాలను పెంచి పోషించింది, పోషిస్తూన్నది అమెరికా. మొదట 1979లో సోవియట్ యూనియన్ ను దెబ్బతీయటం కోసం ఆఫ్ఘనీస్థాన్ లో ఒసామా బిన్ లాడెన్ ఆధ్వర్యంలొ ఆల్ ఖైదాకు సైనిక శిక్షణ నిచ్చి, నిధులు,ఆయుదాలు సమాకూర్చి ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించింది అమెరికా చివరికి తన గోతిలో తానే పడింది.న్యూయార్క్ ఘటన వెంటనే ఆఫ్గాన్ పై యుద్దం ప్రకటించిన అమెరికా చేసిన దాడుల్లో నాలుగు లక్షలకు పైగా మరణించారు ఇందులో 86% ఆఫ్గాన్ లోని సాధారణ పౌరులే.వీరికి అసలు అమెరికా ట్విన్ టవర్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు..

Article On ISIS

మరోసారి జీవరసాయణ ఆయుధాలున్నాయన్న నెపం తో ఇరాక్ పై ధాడికి తెగబడింది అమెరికా,దీనికి వత్తాసుగా నిలబడింది బ్రిటన్. నిక్షేపంగా తన దేశాన్ని తను ఏలుకొంటూ.. ఉండే వాడు సద్దాం హుస్సేన్. అమెరికా తన ఆయిల్ ఆకలికి ఆ దేశాన్ని నాశనం చేసింది. సద్దాంను గద్దె దించింది. సద్దామ్ని పట్టి చంపింది.ఆ యుద్దం లో కూడా చనిపోయిన సాధారణ పౌరులకి “జీవ రసాయణ ఆయుధాలు” అంటే ఏమిటో కూడా తెలియదు. కొంత కాలం శాంతిస్థాపన పేరుతో అక్కడే ఉంది తిరుగు బాటు దారుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ సైనికులకు తామెందుకు చనిపోతున్నమో తెలియదు.

Article On ISIS

ఇరాక్ యుద్దం ఆ దేశ ఆర్థిక వ్యవస్తనీ,అక్కడి వాతావరణాన్నీ సర్వనాశణం చేసింది. అక్కడితో పరిస్థితులు దిగజారాయి.అక్కడి ప్రజల్లో అమెరికా అన్నా,తమకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోలేని ఇతర దేశాలన్నా ద్వేషం పెరిగిపోయింది. విదేశాల్లో ఉన్న అమెరికా సైన్యాన్ని వెనక్కు రప్పిస్తామనే హామీ మీద ఓట్లు పొందారు. అందుకు తగ్గట్టుగా అమెరికా ఇరాక్ ను ఖాళీ చేసి వెళ్లింది. ఒక వ్యవస్థ.. ప్రభుత్వం అంటూ లేకుండా పోయిన ఇరాక్ ఉగ్రవాద ముఠాలకు ఆటపట్టుగా మారిపోయింది.యుద్దానికి ముందు ఇరాక్ లో లేని ఉగ్రవాదం మొదలైంది. ఇరాక్‌లో అత్యధిక భాగం ఇస్లామీయ రాజ్య వ్యవస్థాపన కోసం పోరాడుతున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్నది. చమురు నిక్షేపాలపైన ఉగ్రవాద సంస్థ ఆధిపత్యం వల్ల నిధులకు కానీ ఆయుధాలకు కానీ కొరత లేదు.ప్రతీదాడిలో చనిపోయే పౌరులకు తమ నేరమేమిటో తెలియదు.

Article On ISIS6

అనంతరం లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలోనూ అమెరికా పాత్ర ఉన్నది. గడాఫీకీ ఉగ్రవాదానికీ సంబంధం లేదు. అఫ్ఘానిస్తాన్‌లో సోవియెట్ యూనియన్ ప్రారంభించిన ఆధిపత్య పోరు అమెరికా, పాకిస్తాన్‌లు కలసి తాలిబాన్‌ను తయారు చేయడానికీ, అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియెట్ యూనియన్ నిష్ర్కమణకూ, ఆ దేశంలో తాలిబాన్ పాలనకూ దారి తీసింది.మతం దేవుడూ అన్నవి కేవలం వంక లు మాత్రమే ఇది ఒక ప్రతీకార, ఉన్మాద పోరు.

ఇరాక్‌, ఆఫ్గన్‌లలో అమెరికా చేసిన యుద్ధాల్లో 4,683 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. ఇరాకీయులు ఆఫ్గనీయుల స్వేచ్ఛకోసం అమెరికా ఈ యుద్ధాల్ని 2001 అక్టోబర్‌ 7 నుంచి ప్రారంభించింది.ఇక గాయపడిన అమెరికన్‌ సైనికుల సంఖ్యా తక్కువేం కాదు. అమెరికా రక్షణ సర్వీసులకు చెందిన 30,490 మంది ఇరాక్‌పై దాడిలోనూ, 2,309 మంది ఆఫ్గన్‌పై దాడిలోనూ గాయపడ్డారు. మొత్తం 32,799 మంది.ఎవ్వరికీ ఆఫ్గాన్,ఇరాన్ పౌరుల మీద వ్యక్తిగత ద్వేషం లేదు. అసలు వారిని చంపటానికి కారణం ఏమిటో కూడా సైనికులకి అవసరం లేదు కేవలం ప్రభుత్వాల ఆదెశాల మేరకే వారు లక్షల ప్రాణాలు తీసారు.

Article On ISIS

ఆయిల్ మార్కెట్ పై గుత్తాదిపత్యం సాదించే దిశగా పావూలు కదిపిన అమెరికా ఇజ్రాయిల్‌కు ఇబ్బందికరంగా ఉన్న సిరియాలో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు చేసింది. గత కొన్నాళ్ళుగా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ను అధికారం నుండి తొలగించేందుకు అక్కడి ప్రతిపక్షాలకు అమెరికా దాని మిత్ర దేశాలు సహాయం చేస్తున్నాయి. అనేక రకాలైన ఆర్థిక ఆంక్షలు విధించారు. గత సంవత్సర కాలంగా సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సిరియాలోని అంతర్యుద్ధంలో రసాయన ఆయుధ ప్రయోగ అంశం అవకాశంగా దొరికింది.అమెరికా సహకారం తో జరిగిన దాడుల్లో వేలమంది చిన్నారులు మరణించారు. హమాస్ వంటి ఉగ్రవాదులకు ముఖాముఖీ తలపడేలా బయటకు వచ్చే అవకాశం దొరికింది.ఇ దేశ విషయంలో అమెరికా తరపున జోక్యం చేసుకుంది ఫ్రాన్స్.చనిపోయిన చిన్నారులు మన పిల్లలాంతి వారే వారికి క్రూడ్ ఆయిల్ ఎవరిదగ్గరుంటే ఎవరికి లాభమో కూడా తెలియదు.

Article On ISIS4

దాడులకు ఫ్రాన్స్ మద్దతు పలకటం తో ఫ్రాన్స్ నే కాదు తమకు వ్యతిరేకంగా వచ్చే ఇతర దేశాలను కూడా వణికించాలనుకున్న ఐఎస్ఐఎస్  దాడులకు తెగబడింది. ఈ పదెళ్ళలో తన నెట్వర్క్ ని విస్తరించుకున్న ఆ ఉగ్రవాద సంస్థకు ప్యారిస్ లో సెక్యూరిటీ అధికారులను కొనటం పెద్దకష్టం కాలేదు. ప్యారిస్ మృతులకూ అసలు ఐఎస్ ఐఎస్ ఎందుకు తమని చంపిందో ఇప్పటికీ తెలియదు. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు తమ ప్రాణాలను బలితీసుకున్నాయని వారికెప్పటికీ ఇక తెలియదు.

ఇన్ని ప్రాణాలు పోవటానికి,ఇన్ని ఉగ్రవాద సంస్థల పుట్టుకకూ కారణం కేవలం సామ్రాజ్య కాంక్ష. ఆయిల్ నిక్షేపాలపై పట్టు సాదించాలనే దాహం. ఆ క్రతువు కోసమే ఇంత నరబలి. రేపు మన ఊరే యుద్ద వేదిక కావొచ్చు. ఉగ్రవాదాన్నే కాదు అమెరికా లాంటి దేశాలఅగ్రవాదాన్ని కూడా వ్యతిరేకించకపోతే మనకూ బాంబుదాడుల మరణం తప్పక పోవచ్చు….

Must Read: మనమే మన పిల్లలని చంపుకుంటున్నామా..?

(Visited 250 times, 1 visits today)