Home / Inspiring Stories / ఆవు చేస్తోన్న న్యాయ పోరాటం

ఆవు చేస్తోన్న న్యాయ పోరాటం

కొన్ని సంఘటనలు మన మనసుని పిండేస్తాయ్..! జంతువులు ఆలోచించలేవూ వాటికి మనుషులకున్నంత ఙ్ఞానం లేదు అనుకునే మనం ఒక్కోసారి జంతువుల ఙ్ఞాపక శక్తికి ఆశ్చర్య పోవాల్సిందే. ఉత్తర కర్ణాటక లోని సిర్సిలో జరిగిన ఈ సంఘతన మీ కళ్ళని ఒకా నిమిషం తడి చేయక మానదు. సిర్సి పట్టనం లోనే కొన్నళ్ళ క్రితం ఈ వీడియో లో కనిపిస్తున్న ఆవు బిడ్ద అయిన దూడ ఒకటి బస్సు కింద పడి చనిపోయింది. అప్పటినుంచీ ఆ బస్సు డ్రైవర్ ని గుర్తు పెట్టుకున్న ఈ ఆవు రోజూ ఆ బస్సుని అడ్డుకుంటూనే ఉంది. తన బిడ్డ మరణానికి న్యాయం కోసం పోరాదుతూనే ఉండి. మనుషులకే జరిగిన అన్యాయాన్నే పెద్దగా పట్టించుకోని మనుషులు తనకు న్యాయం చేయరని తెలియని ఆ ఆవు ఆ బస్సు వెంట పడుతూనే ఉంది.

ఎంతప్రయత్నించినా, ఎన్ని రకాలు గా వెళ్ళగొట్టినా ఆవు బస్సు కి అడ్డం పడుతూండటం మానక పోవటం తో ఆరూట్ లో ఆ బస్సుని నడపటం మానేసారు అధికారులు. ఆ ఆవు మాత్రం రోజూ వచ్చీ పోయే బస్సులని చూస్తూ అక్కడే నిలబడుతోంది. కొన్ని రోజుల తర్వాత బస్సు రంగు మార్చి మళ్లీ నడపటం మొదలుపెట్టారు కానీ ఆవుకి మాత్రం న్యాయం జరగలేదు.

Must Read: వాఘా సరిహద్దులో పాకిస్తాన్ గేటుని స్కార్పియో‌తో ఢీకొట్టిన భారతీయుడు.

(Visited 1,318 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]