Home / Inspiring Stories / బిల్ ని సరిగ్గా చెక్ చేస్కొండి..! రెస్టారెంట్ వారు చేసే మోసాన్ని కనిపెట్టండి.

బిల్ ని సరిగ్గా చెక్ చేస్కొండి..! రెస్టారెంట్ వారు చేసే మోసాన్ని కనిపెట్టండి.

Author:

ఒక చల్లని సాయంత్రం కుటుబంతో అల బయటికి వెళ్ళి  డిన్నర్  చేసి వస్తే  ఆ సంతోషం మనకు కొన్ని రోజుల వరకు వెంటాడుతుంది. అలాగే మనకు ఫ్యామిలీతో గడిపిన ఆనందం ఉంటుంది. ఇలానే బెంగులూర్ లో ఒక ఫ్యామిలీ పంజాబి బై నేచర్ అనే రెస్టారెంట్ కి వెళ్ళారు. తినడానికి ఎవరికి నచ్చినవి వారు ఆర్డర్ ఇచ్చారు. వాటర్ బాటిల్స్ కూడా తీసుకురావలసిందిగా ఆర్డర్ చేశారు, చెప్పిన ఆర్డర్ వచ్చింది సంతోషంగా అందరు కబురులు చెప్పుకుంటు, నవ్వుకుంటు సరదాగా డిన్నర్ చేశారు తర్వాత వెళ్ళే సమయంలో బిల్ వచ్చింది అంతే ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అయ్యింది దానికి కారణం ఆ బిల్ లో పుడ్ కి బిల్ చాలానే వేసిన సరే ఒక్కోక్క హొటల్లో ఒక్కో విధంగా ఉంటుంది అనుకోవచ్చు కానీ వాటర్ బాటిల్స్ బిల్ మాత్రం 500 వచ్చింది.

Water-Bottle

సరే ఇందులో ఏమైన సర్వీస్ ఛార్జ్ వేశారేమో అనే అనుమానం వచ్చింది కానీ సర్వీస్ టాక్స్ ఇతర టాక్స్ బిల్ సపరేట్ గా వేశారు. ఈ వాటర్ బాటిల్ మాములు ధర 25 రూపాయాలు కానీ దీనిని 125 రూపాయాలకి అమ్ముతూ ఇటు కస్టమర్స్ ని అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.

ఇలాంటివి ఒక్క ఈ రెస్టారెంట్ లోనే కాదు చాలా రెస్టారెంట్ లలో ఇలానే జరుగుతుంది. దీని గురించి ఏప్రియల్ 20,2016 రోజున యూనియన్ మినిస్టర్ రాం విలాస్ గారు మట్లాడుతూ… మన దేశంలో ఫైవ్ స్టార్ హొటల్ అయిన త్రీ స్టార్ హొటల్ అయిన, ఎయిర్ పొర్ట్ అయిన, రైల్వే స్టేషన్ అయిన M.R.P కంటే ఎక్కువ తీసుకుంటే వారు శిక్షకు అర్హులుగా ప్రకటించాడు. అలాగే ఇలాంటి మీ చుట్టు ఉండే ప్రాంతాలలో ఎక్కడైన ఇలాంటివి జరిగితే సంబంధిత శాఖకి సమాచారం ఇస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేశాడు.

Must Read: వాహనం కొనేటప్పుడు మీ బిల్ ఒకసారి చెక్ చేసుకొని షో రూం వాళ్ళు చేసే మోసాన్ని కనిపెట్టండి.

(Visited 3,490 times, 1 visits today)