Home / Inspiring Stories / వాహనం కొనేటప్పుడు మీ బిల్ ఒకసారి చెక్ చేసుకొని షో రూం వాళ్ళు చేసే మోసాన్ని కనిపెట్టండి.

వాహనం కొనేటప్పుడు మీ బిల్ ఒకసారి చెక్ చేసుకొని షో రూం వాళ్ళు చేసే మోసాన్ని కనిపెట్టండి.

Author:

భారత దేశంలో మధ్య తరగతి వారికి సొంత ఇల్లూ,కారూ అనేవి సర్వసాధారణంగా ఉండే కలలు. అయితే ఉన్న దానిలోనే కొద్దికొద్దిగా సేవింగ్స్ లో దాచుకొనీ లోన్ తీసుకొనీ కారు కొనాలనుకుంటే… మాత్రం అసలు కారు ధర కన్నా ఎక్సైజ్ డ్యూటీ,వ్యాట్ ఇనకా హెఫ్టీ రోడ్ టాక్స్ అనీ ఆన్ రోడ్ ప్రైజ్ తడిసి మోపెడౌతుంది. మొత్తం కట్టి కారు ఇంటికి తెచ్చుకునే సరికి ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది..

Car Handling Charges

కానీ కొందరు డీలర్లు ట్యాక్స్ ల పేరుతో వసూలు చేసే డబ్బు మోసపూరితంగా తీసుకునేదని (చట్ట విరుద్ధం) మీకు తెలుసా? లాజిస్టిక్ లేదా హాండిలింగ్ చార్జ్ పేరిట కారు ధరని బట్టీ 5000 నుంచీ 1,00,000 వరకూ ఉంటోంది. అయితే ఇది ప్రభుత్వ చట్టాల ప్రకారం తీసుకోకూడని మొత్తం. అంటే ఇది కేవలం మీ డీలర్ వసూలు చేసే అదనపు సొమ్ము అన్నమాట.

భారత దేశం మొత్తం మీదా 2014-15 సంవత్సరం లో దాదాపుగా 1,97,52,580 మోటారు వాహనాల కొనుగోళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఒక్కొక్క వాహనం మీదా హాండిలింగ్ చార్జీల పేరుతో కనీసం 5,000 రూపాయలు వసూలు చేసినా 9,876,29,00,000 కోట్ల రూపాయలు వాహన తయారీ దారుల,డీలర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇదంతా కూడా అక్రమ వసూల్ల కిందకే వస్తుంది.

Car Show rooms cheating

ఇలా లాజిస్టిక్/హ్యాండిలింగ్ చార్జీల పేరుతో చేస్తూన్న వసూలను అరికట్టటానికి డిల్లి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం తమ రాష్ట్రం లోని మోటారు వాహన డీలర్లందరికీ ఒక పబ్లిక్ నోటీసును జారీ చేసింది. ఈ నొటీసులో ఉన్న ప్రకారం ఏ డీలరు గానీ లేదా మరే మోటారు వాహన తయరీ సంస్థ గనీ అధిక సొమ్ముని టాక్స్ ల పేరిట వసూలు చేసినట్టు ఋజువైతే వారి ట్రేడ్ సర్టిఫికెట్ రద్దు చేయబదుతుంది,వారి రిజిస్ట్రేషన్ హక్కులనూ రద్దు చేయటమే కాక,పెనాల్టీ కూడా వేస్తారు. కేరళ ప్రభుత్వం కూడా ఈ మధ్యనే తమ రాష్ట్రం లోని అందరు డీలర్లకూ ఇదే తరహ నొటీసులను పంపించింది. అంతే కాదు ఇలా అక్రమ దోపిడీకి పాల్పడుతున్న డీలర్ల నుంచి భారీ ఎత్తున జరిమానా కూడా వసూలు చేసింది.

ఈ జనవరి 30న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం లో ఉన్న అన్ని మోటారు వాహన డీలర్లకూ, కంపెనీలకూ, షోరూంలకూ, హండ్లింగ్ చార్జీల పేరిట ఎటువంటి అదనపు చార్జీలనూ వసూలు చేయవద్దంటూ ఒక సర్క్యులర్ ని జారీ చేసింది.

Car Show rooms

ఢిల్లీ ప్రభుత్వం తరహాలో ప్రతీ డీలర్ ఆఫీసుకీ పేరు పేరునా. సర్క్యులర్ నోటీసులు అందినప్పుడూ, వినియోగదారుల్లో ఈ విషయం పై అవగాహన, సమాచారమూ పెరిగినప్పుడూ తప్ప ఈ తరహా దోపిడీ ఆగటం కష్టమే.డిల్లి,కేరళా,తెలంగాణా ప్రభుత్వాలు మినహా దేశం లోని మిగిలిన రాష్ట్రాలన్నీ ఈ విధమైన దోపిడీని అడ్డుకోవటం లో నిర్లక్ష్యం కనబరుస్తూనే ఉన్నాయి..

ఈ సారి మీరు వాహనం కొనటానికి వెళ్ళినప్పుడు ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంటు వారి అఫిడవిట్ ఇవ్వమని అడగండి, తయారీ దారు నిర్ణయించిన ధర కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువగా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతీ డీలర్ ఆఫీసులోనూ ఈ అఫిడవిట్ ప్రతీ ఒక్కరికీ కనిపించేలా ప్రదర్శించాలి కాని మన దగ్గర షో రూంలలో వాటి గురుంచి అడిగితే సమాధానం దాట వేస్తారు, మీరు వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలని గుర్తుపెట్టుకొని డీలర్లు చేతిలో మోసపోకండి.

Must Read: క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు..!

(Visited 131,322 times, 1 visits today)