Home / Inspiring Stories / నటుడు పృద్వీ రాజ్ ఆత్మహత్య వీడియో

నటుడు పృద్వీ రాజ్ ఆత్మహత్య వీడియో

Author:

నటుడు పృద్వీరాజ్ రూపొందించిన సూసైడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. రంగుల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి నిజజీవితంలో కూడా అనేక ఘటనలు ఉంటాయి. మరి వాటన్నింటిని తట్టుకోని నిలబడి జీవీతంతో పోరాడితేనే బతుకంటే భయం ఉండదు.. కాని ఇక్కడ కొంతమంది అన్ని వదిలేసుకోని సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మద్యనే యువ నటి ప్రత్యూషా బెనర్జీ , టీవీ నటుడు సాయి ప్రశాంత్ సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు అని చెప్పడానికి అవగహన కల్పించడానికి పృద్వీరాజ్ ఒక వీడియోని రూపొందించారు.

మీ చర్మం పేపర్ కాదు దానిని కట్ చేయద్దు, మీ ఫేస్ మాస్క్ కాదు దాన్ని దాచొద్దు, మీ జీవితం సినిమా కాదు దాన్ని ముగించోద్దు అని ఒక సందేశం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన వారిలో జీవితంపై ఆశ కల్పించేలా అటువంటి ఆలోచనలు రాకుండా వాటి నుండి బయటపడేలా ఈ వీడియో రూపొందించారు. ఇప్పుడు ఈ వీడియో అందరి మన్ననలు పొందుతుంది.

Must Read: నైజం కలం నాటి హైదరాబాద్ అరుదైన వీడియో.

(Visited 30,885 times, 1 visits today)