Home / Entertainment / విలన్ గా నటించనున్న అల్లు అర్జున్?

విలన్ గా నటించనున్న అల్లు అర్జున్?

Author:

సరైనోడు ఘన విజయంతో మంచి ఊపులో ఉన్నాడు అల్లు అర్జున్. ఈ మధ్య అల్లు అర్జున్ పట్టిందల్ల బంగారం అవుతుంది. సినిమా, సినిమాకి కొత్తగా కనిపిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… నెగటివ్ పాత్రలో కూడా కనిపించేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన తన సినిమా ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో తన మనసులో మాట కూడ చెప్పాడు. సరైనోడులో ఆది పినిశెట్టి పోషించిన విలన్ పాత్ర తనను బాగా ఆకట్టుకుందని, అలాంటి పాత్ర దొరికితే నెగటివ్ పాత్రలో చేయటానికి తనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. ఇప్పటికే ఆర్య-2 సినిమాలో బన్నీ నెగిటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూశాం. కాకపోతే అది విలన్ షేడ్స్ ఉండే హీరో పాత్ర.

allu arjun doing negative role

తమిళ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఇందులో హీరో, విలన్ గా కూడా నటించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. అయితే నిజంగానే లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందా? విలన్ పాత్ర బన్నీ చేస్తాడా? అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Must Read: అ..ఆ పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 2,387 times, 1 visits today)