Home / health / సర్వరోగ నివారిణి అయిన”కలబంద”ని ఉపయోగించే పద్ధతులు

సర్వరోగ నివారిణి అయిన”కలబంద”ని ఉపయోగించే పద్ధతులు

Author:

‘కలబంద’ మనకు పరిచయం అవసరం లేని మొక్క. కానీ, ఇది చేసే మంచి పనుల గురించి అందరికి తెలిసుండదు. కలబంద చూడటానికి పిచ్చి మొక్కలాగా కనబడుతుంది. కానీ, ఇది చేసే మేలు అంతా.. ఇంతా.. కాదు. అందుకే, కలబందను సర్వరోగ నివారిణి అంటారు. కలబంద మొక్కని సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. మనదేశంలో సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్యంలోను దీనిని ఎక్కుగా ఉపయోగిస్తున్నారు. కలబంద నుండి రకరకాల లోషన్లు, క్రీమ్ లు, జ్యూస్‌, హెయిర్‌ ఆయిల్‌ లాంటి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని ఉత్పత్తులు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి.

aloe-vera-benefits-in-telugu

కలబంద వలన ఉపయోగాలు :

  • జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది.
  • ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకును తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులను మటుమాయం చేస్తుంది.
  • కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
  • కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
  • శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
  • కలబంధ అటు తరుణ వ్యాధులకు, ఇటు దీర్ఘ వ్యాధులకు కూడా అమోఘంగా పనిచేస్తుంది.

తల వెంట్రుకలకు, చర్మ సౌందర్యం కోసం :

  • కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్‌ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది.
  • కలబంద ఆకురసంతో నల్లమచ్చలు పోగొట్టవచ్చు.
  • కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా, మంచి నిగారింపును సంతరించుకుంటుంది.
  • తలకు కలబంద వాడడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లబడడం, ఎర్రబడటం చుండ్రులను ఇది నివారిస్తుంది.
  • తలలో వచ్చే అనేక పుండ్లను దురదలను ఇది తగ్గిస్తుంది.

కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మ సంరక్షణ ర్యాసిస్‌, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవడం మొదలగు వాటికీ కలబంద మంచి ఫలితాలని ఇస్తుంది. 15 రకాల పోషకాలు మిళితమై మంచి శక్తి నిస్తాయి. దీని వల్ల కలిగే అనేక ఉపయోగాలను బట్టి, దీనిని అద్భుతమైన మొక్క, సహజ నివారిణి అని కూడా అంటారు. కలబంద ఆకులో నాలుగు పొరలు ఉంటాయి. మొదటి పొర మందంగా ఉండి మొక్కను రక్షిస్తుంది. రెండవ పొరలో ఉన్న పసరు చేదు రసము. మూడవది జిగురు పదార్థము. నాలుగవది జిగురు కలబందలోని లోపలి పొరలో ఉండే కలబంద జిగురు.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 11,263 times, 1 visits today)