Home / Inspiring Stories / కోట్ల ఆస్తి ఉన్న అతను బిచ్చగాడై కరాచీ వీధుల్లోకి చేరుకున్నాడు.

కోట్ల ఆస్తి ఉన్న అతను బిచ్చగాడై కరాచీ వీధుల్లోకి చేరుకున్నాడు.

Author:

మామూలుగూ గుబురు గడ్డంతో రోడ్డు మీద కనిపించే బిచ్చగాడిలా ఉన్న వ్యక్తి, అసలు ఏమీ తెలియదు అని మీరనుకుంటున్న మనిషి మీరు మాట్లాడే ఇంగ్లిష్ లో గ్రామర్ తప్పని ఇంగ్లీష్‌లో మాట్లాడితే మీకెలా ఉంటుంది? ఇంగ్లిష్ ఫ్రొఫెసర్లకే దిమ్మతిరిగేలా ఇంగ్లీష్‌లో వ్యంగ్యాలు, హాస్యాలు, కవితలు, చమత్కారాలు వరుసగా వినిపిస్తే ఎలా ఫీలౌతారూ? పాకిస్తాన్ నటుడు అహసాన్ ఖాన్‌ కి కరాచీడిఫెన్స్ మార్కెట్‌లో అలాంటి ఓ యాభై ఆరేళ్ల వ్యక్తి పిచ్చివాడిలా కనిపిస్తూనే అతన్ని ఆశ్చర్యానికి గురి చేసాడు. అహసాన్ అతనికి జాలిగా డబ్బులివ్వబోతే. ‘డబ్బులొద్దు… ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి’ అని ఆ వృద్ధ్ధుడు ఇంగ్లీష్‌లో అడిగేసరికి ఖాన్ షాక్ తిన్నాడట.

అతనితో కొద్దిసేపు మాట్లాడితే తెలిసింది అతనొకప్పుడు పాక్ లోనే బిజినెస్స్ మాగ్నెట్ ఒకప్పుడు బాగా బతికిన అతడి కారును.. రెండు డంపర్లు ముందు నుంచి, వెనక నుంచి ఢీకొట్టి నుజ్జు నుజ్జు చేశాయి. ఈ ప్రమాదంలో భార్య, ఏడుగురు పిల్లలు చనిపోయారు. ఇతను ఆస్పత్రిలో ఉండగా అన్నదమ్ములు ఆస్తిని దోచేసి, గెంటేశారు. ఒకప్పుడు కోట్ల ఆస్తి ఉన్న అతను బిచ్చగాడై కరాచీ వీధుల్లోకి చేరుకున్నాడు.ఈ కథంత విన్న అహసాన్ అతని వీడియోను తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు.అంతే వేలాది మంది నెటిజన్లు స్పందించారు.కరాచీలోని ఆమ్ టెక్ సిస్టమ్స్ అనే కంప్యూటర్ సంస్థ అయితే అతనికి ఉద్యోగమూ, క్వార్టర్స్ ఇచ్చింది. తన సొంతమనుషులే అతన్ని బిచ్చగాడిని చేసారు కానీ మిగిలిన ప్రపంచం అతన్ని మళ్ళీ అదుకుంది….

Must Read: అతనో బార్బర్ అయితేనేం 200 కార్లకి ఓనర్.

(Visited 10,402 times, 1 visits today)