Home / Inspiring Stories / అతనో బార్బర్ అయితేనేం 200 కార్లకి ఓనర్.

అతనో బార్బర్ అయితేనేం 200 కార్లకి ఓనర్.

Author:

Ramesh Babu Barber కర్ణాటకకు చెందిన రమేష్ వృత్తిరీత్యా బార్బర్…చేసేది జట్టు గొరగటం అయినా, కాస్త విలాసవంతమైన సింగపూర్ కటింగ్ కి ఫేమస్. ఒక కటింగ్ కి జస్ట్ 65 రూపాయలు. పలువురు వీఐపీలు ఆయన దగ్గరే క్షవరం చేయించుకుంటారు. పుట్టుకతో అతడు ఒక బార్బర్ కొడుకు చిన్న తనంలోనే తండ్రి చనిపోయాడు. ఆర్ధిక సమస్యలతో అతని తల్లి చాలామంది ఇళ్ళల్లో పనిమనిషిగా పనిచేసింది. చిన్ తనం నుండి ఆర్ధిక సమస్యలతో పెరిగిన ఆ వ్యక్తికి తన తండ్రిలా బార్బర్ గా జీవితం గడపడం ఇష్టం లేదు. కానీ పెద్ద చదువులు చదువుకోక పోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయం. దాంతో బార్బర్ వృత్తినే కొనసాగించాడు. అయితే ఎలాగోలా 1994లో కేవలం కొద్ది పాటి మొత్తంతో ఓ మారుతి వ్యాన్ కొన్నాడు. అది నిరుపయోగంగా పడి ఉండటం ఎందుకని కార్ రెంటల్ బిజినెస్ మొదలు పెట్టాడు. మొదట్లో ఆ బిజినెస్ సరిగ్గా నడవక పోవడంతో నానాపాట్లు పడ్డాడు. అయినా తన పట్టుదల వీడలేదు అనుకోకుండా అవకాశాలు కలిసి రావడంతో సెకండ్‌హ్యాండ్‌ మారుతీ వ్యాన్ తో మొదలు పెట్టిన అతని కార్ రెంటల్ బిజినెస్ లో తోపును చేసింది.ఇప్పుడు అతని దగ్గర మొత్తం 200 కార్లు ఉన్నాయి. అందులో 75 లగ్జరీ కార్లు. తన దగ్గరున్న బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ లాంటి కార్లను బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా అద్దెకు తీసుకెళ్తాడని రమేష్ చెబుతున్నాడు. కష్టపడండి. నిజాయితీగా ఉండండి. దానికి అదృష్టం కూడా తోడైతే మీరూ హీరోలే అంటున్నాడు.

Ramesh Babu Barber

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచన్ లు, బెంగుళూరులో ఒక మోస్తరు నుంచి కొద్దిగా ఇమేజ్ ఉన్న పొలిటికల్ లీడర్లు కూడా రమేష్ బాబు కస్టమర్లే.. అంత బాగా సంపాదనలో పడినా.. డైలీ షాపుకెళ్లి పని చేస్తాడు రమేష్ బాబు.. తన పాత రోజులను మర్చిపోకుండా బార్బర్ పని చేస్తునే ఉంటాడు. ఫస్ట్ నుంచీ రమేష్ బాబుకు సొంత కారు కొనుక్కోవాలని కోరిక. అందుకు కష్టపడి మొదట ఒక మారుతి ఓమ్ని వ్యాన్ కొన్నాడు. దానిని రెంట్ కు తిప్పడం మొదలుపెట్టాడు. అంతే, అప్పటినుంచి రమేష్ లక్ స్టీరింగ్ లా తిరగడం మొదలుపెట్టింది. సక్సెస్ ఫుల్ కార్ రెంటల్ బిజినెస్ మాన్ గా పేరు సంపాదించాడు. రమేష్ బాబు దగ్గర ప్రస్తుతానికి 200 కార్లు ఉన్నాయి. వాటిలో రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్, మెర్సిడెస్ ఛ్, ఏ , శ్ క్లాసులు, భంవ్ 5, 6 , 7 సిరీస్ కార్లున్నాయి. కస్టమర్లతో సౌమ్యంగా మాట్లాడే రమేష్ బాబు రెంటల్ ఏజన్సీలో రోజుకు వెయ్యి రూపాయల నుంచి 50,000 ల దాకా రేంజ్ లో రెంట్ కి దొరుకుతాయట. ఇక ఎంత ఎదిగినా మూలాలను మరచిపోకూడదనే రమేష్ బాబు తన పిల్లలకు రోజూ హెయిర్ కటింగ్ లో మెళకువలు నేర్పుతుంటాడు.

Must Read: కనుమరుగు కానున్న గ్రేట్ చైనా వాల్.

(Visited 32,412 times, 1 visits today)