Home / Inspiring Stories / ఆటో నుంచి ఆకాశం దాకా.

ఆటో నుంచి ఆకాశం దాకా.

Author:

delivery boy to Pilot

శ్రీకాంత్ నాగ పూర్ కి చెందిన యువకుడుడు ఒకప్పుడు ఆటో డ్రైవర్ ఇప్పుడూ డ్రైవరే కాకుంటే ఇప్పుడు అతన్ నడిపే త్రీ వీలర్ ఆటో కాదు ఫ్లైట్. ఔను మీరు చదువుతున్నది నిజమే. 12వ తరగతి చదువుతూ చదువు ఆపేసి న అతనే ఈరోజు ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్. ఎలా? అంటే..
శ్రీకాంత్ పంత్వానే నాగ్ పూర్ లోని ఒక మురికి వాడలో నివసించే వాడు. తండ్రి ఒక వాచ్ మెన్, ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువాపేసిన శ్రీకాంత్ ఇంటి అవసరాల కోసం ఒక కొరియర్ ఆఫీస్ లో డెలివరీ బాయ్ గా చేరాడు. అనుకున్న సమయానికి డెలివరీ చేయటానికి ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు కొన్నాళ్ళకి ఫైనాన్స్ లో ఒక ఆటో కొనుక్కున్నాడు కూడా. ఐతే ఒక డేలివరీకి వెళ్లటం అతని జీవితాన్నే మలుపు తిప్పింది. ఒక రోజు అతను ఒక పార్సెల్ డెలివరీ కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ శిక్షణ పొందుతున్న క్యాడెట్లతో మాట్లాడినప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం లేకుండా కూడా పైలట్ అవచ్చూ అని తెలిసింది.. అప్పటివరకూ శ్రీకాంత్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులే పైలట్ ఔతారు అనుకునే వాడట. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ బయట టీ అమ్మే అతనితో జరిపిన సంభాషణలో DGCA కోర్సు ద్వారా పైలట్ శిక్షణా కోర్స్ కి స్కాలర్ షిప్ ఉంటుందనే విసయం తెల్సింది. ఇక అతను ఆగదల్చుకోలేదు.

Auto Driver to Pilot

తన ఆగిపోయిన చదువుని మళ్ళీ మొదలు పెట్టాడు.12వ తరగతిలో తన స్కాలర్ షిప్ కొసం కావాల్సిన అర్హత మార్కులపైనే అతని దృష్టి అంతా. పాస్ అయ్యాడు పైలట్ శిక్షణా తరగతులకు హాజరయ్యే అర్హత సంపాదించి కోర్స్ లో జాయిన్ అయాడు కూడా. ఐతే మొదటి నుంచీ మాతృ భాషలోనే చదివిన శ్రీకాంత్ కి ఇంగ్లిష్ ఒక పెద్ద అడ్డంకి గా తయారయ్యింది.ఐనా తన సహ విధ్యార్తుల సహాయం తో ఆ సమస్యనీ అధిగమించాడు రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ మీదా పట్టు సాధించాడు. మొత్తానికి ఫలియింగ్ కలర్స్ అకాడెమీ నుంచి తన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ని పొందాడు.

కానీ సర్టిఫికెట్ తో బయటికి వచ్చిఉన శ్రీకాంత్ కి ఆర్థిక మాంధ్యం దెబ్బతో ఉద్యోగం దొరకటం కష్టమయింది ఒక కంపెనీలో ఎగ్జిగ్యూటివ్ గా చేరాడు కొన్నాళ్ళు అదే కంపెనీలో పని చేస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఎట్టకేలకు ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి పైలట్ ప్యాక్ లో ఫస్ట్ ఆఫీసర్ గా సెలక్ట్ అయినట్టు కాల్ వచ్చింది…. ఇప్పుడు శ్రీకాంత్ ఒక పైలట్. ఇప్పుడూ అతను నడిపే వాహనానికి మూడే చక్రాలు ఐతే అది ఆటో కాదు. తన కృషి,పట్టుదలా.. సాధించాలన్న ఆశయం కలిసి అతన్ని గాల్లో ఎగిరేలా చేసాయ్… నాగ పూర్ రోడ్లనుంచి ప్రపంచ దేశాల వరకూ అతన్ని ఎదిగేలా చేసాయ్….

Must Read: 70మంది పసివాల్ల ని ఆదుకుంటున్న చాయ్ వాలా.

(Visited 4,183 times, 1 visits today)