Home / Inspiring Stories / డెబిట్/క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే..!

డెబిట్/క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే..!

Author:

ఈ మధ్య కాలంలో జనాలంతా షాపింగ్ కి అయ్యే ఖర్చుని ఎక్కువగా కార్డు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విధంగా కార్డు రూపంలో చెల్లించే విషయంలో ఏ మాత్రం పొరపాటు చేసిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ఆసరాగా చేసుకొని కొందరు హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఉదంతాలు జంట నగరాలలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య అందరూ షాపింగ్ చేసేటప్పుడు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు నోట్లకి బదులు కార్డు ద్వారా చెల్లించేందుకే మొగ్గుచూపుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొన్ని ముఠాలు ఈ ప్లాస్టిక్ కరెన్సీ వినియోగదారుల్ని మోసం చేస్తున్నాయి. ఈ నేరగాళ్ల బారి నుండి అప్రమత్తంగా ఉండాలని పొలీసులు హెచ్చరిస్తున్నారు.

Credit-Card-Debit-Card-Cheating

క్రెడిట్/డెబిట్ కార్డు వినియోగదారులు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి:

  • క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా బిల్లు చెల్లించే విషయంలో వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
  • పరిచయస్తులు కాని వారికి క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకపోవటం చాలా మంచిది.
  • కార్డు అందుకున్న వెంటనే దాని వెనక వైపు సంతకం చేయాలి.
  • కార్డు వెనక మూడు అంకెల సివివి ఉంటుంది, దానికి రాసిపెట్టుకొని కార్డు పై లేకుండా తుడిచేయాలి.
  • సెక్యూర్డ్ కాని వెబ్ సైట్లలో ఆన్ లైన్ షాపింగ్ చేయటం మంచిది కాదు.
  • కార్డు పైన కానీ, కార్డు యొక్క కవర్ పైన కానీ, పిన్ నంబర్ ని ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు.
  • కార్డు పోగొట్టుకున్నట్లైతే వెంటనే బ్యాంక్ కి వెళ్లి బ్లాక్ చేయించటం మరువకూడదు.
  • పెద్ద మొత్తం నగదు బదిలీ జరిగిన సందర్భంలో వినియోగదారులు గుర్తింపు పత్రాలు తీసుకొని సరిచూసుకోవాలి.
  • ప్రతి నెలా మీరు చేస్తున్న లావాదేవీల బిల్లులు జాగ్రత్త చేసుకొని, కార్డు స్టేట్ మెంట్ వచ్చిన తరువాత సరిచూసుకోవాలి.

Must Read: ఏటీఎం నుండి నకిలీ నోట్లు వస్తే ఏం చెయ్యాలో తెలుసా..?

(Visited 2,546 times, 1 visits today)