Home / Inspiring Stories / 2015 అసహ్యకరమైన వ్యక్తి అరవింద్ కేజ్రివాల్.

2015 అసహ్యకరమైన వ్యక్తి అరవింద్ కేజ్రివాల్.

Author:

Most Hated Indians of 2015

భారతదేశం అసహనంతో అట్టుడికిన సంవత్సరం 2015 కొందరు వివాదాస్పద చర్యలతో మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నో రకాలుగా వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఐతే అందరికన్నా ఎక్కువగా విమర్శలకు గురైంది ఎవరూ అన్న విషయం పై గూన్జ్ ఇండియా ఇండెక్స్ అనే వార్షిక క్రానికల్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాపం అత్యదికంగా 1.99 పాయింట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి స్థానంలో నిలిచారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్ని తక్కువ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు, ఇక మొన్నటికిమొన్న “అభద్రత, అసహనం” కోటాలో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ మూడో ప్లేస్‌లో ఉన్నారు. టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి నాలుగో స్థానంలో , కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐదో స్థానంలో , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరో స్థానంలో ఉన్నారు…

Most Hated Indians of 2015

పాకిస్తాన్ కి వెళ్ళు అంటూ హడావుడి చేసి మరీ వివాదాల్లోకి లాగబడ్డ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మీద ఈ ప్రభావం తక్కువే ఉంది ఎందుకంటే ఆయన ఏడో స్థానంలో నిలిచారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాకరే ఎనిమితో ప్లేస్‌లో ఉండగా, గుజరాత్‌లో పటేల్ వర్గానికి రిజర్వేషన్ కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ 9వ స్థానంలో ఉనాడట. ఇక అందరికన్నా తక్కువగానే అయినా అసహ్యించుకోబడ్డ వారి జాబితాలో చోటు చేసుకున్న వ్యక్తి గాయకుడు యో యో హనీ సింగ్ పదో స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే తరహాలో 2015లో భారతీయులు బాగా అసహ్యహించుకున్న పార్టీ కూడా ఆప్ కావడం విశేషం.ఇన్ని విజయాలు సాధిస్తున్న ముఖ్యమంత్రిగా పేరున్న అరవింద్ కేజ్రివాల్ పోయినేడాది మొదట్లో జరిగిన రైతు గజేంద్ర “ఆత్మహత్య” అంటూ జరిగిన అనుమానాస్పద మృతి సమయం లో అత్యధికంగా విమర్శలకు గురయ్యారు.

భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ , సామాజిక మాధ్యమాల్లో నెటింజన్లు ప్రతికూల వ్యక్తుల కోసం సెర్చ్ చేసి వారిపై చేసిన కామెంట్ల ఆధారంగా ఈ సర్వే రిపోర్టు తయారు చేసినట్లు గూన్జ్ ఇండియా ఇండెక్స్ క్రానికల్ పేర్కొంది.ఐతే ఈ సర్వేలో వాళ్ళు ఊహించిన వ్యక్తులువవేరట. మొదటిస్థానం అమీర్ ఖాన్ దీ అదేవరుసలో మొన్నటికి మొన్న హిట్ అండ్ రన్ కేసులో బయటకువచ్చిన సల్మాన్ ఖాన్ నీ ఊహించారట. అసలు హనీసింగ్,హార్థిక్ పటేల్ లు కనీసం వారి ఊహకు కూడా అందని వ్యక్తులు. అయితే ఫలితాలు వారిని ఆశ్చర్యం లో ముంచెత్తాయి. ఊహించని విధంగా అరవింద్ రావటం. రాహుల్ ని ఊహించినా మరీ రెండో స్థానం లో రావటం కాస్త విస్మయాన్నే కలిగించిందట. మరి మీకేలా ఉన్నాయీ ఫలితాలు???

Must Read: బాహుబలిని వెనక్కి నెట్టి మొదటిస్థానం లో సర్దార్ గబ్బర్ సింగ్.

(Visited 1,501 times, 1 visits today)