Home / Inspiring Stories / అవార్డుల వాపసు విషయంలో తేల్చి చెప్పిన కమల్ హసన్.

అవార్డుల వాపసు విషయంలో తేల్చి చెప్పిన కమల్ హసన్.

Author:

Kamal Hasan comments on Awards returning

“వాళ్ళు నాకు గౌరవ సూచకంగా ఇచ్చిన అవార్డుని నేను ఒక నిరసనకి సూచనగానో,నా అభిప్రాయాలకు అనుగుణంగానో తిరిగి ఇచ్చి వాటిని అవమనించలేను” ఈ మాటలన్నది ఎవరో కాదు విశ్వనాయకుడు అన్న పేరున్న కమల్ హసన్ సినిమా నటనలో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ దక్షిణాది నటుడు తన అవార్డులని తిరిగి ఇచ్చే ప్రశ్నే లేదంటున్నాడు.

నేను ఏ అవార్డు నీ తిరిగి ఇవ్వ బోవటం లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు కావు అవి నా మీద అభిమానం ఉన్న ప్రజల వల్ల వచ్చినవి.నిరసన తెలియ చేయటానికి ఎన్నో మార్గాలున్నాయి అవార్డులివ్వటం అనేది నేను చేయను అంటూ పేరు, అవార్డుల మీద ఉన్న ప్రేమని చెప్పారు ఈ నటుడు ఇప్పటి వరకూ నాలుగు జాతీయ సినీ అవార్డులు, 19 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సహా పలు భారతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. ఏడు సమర్పణలతో కమల్ హాసన్ అకాడమీ అవార్డు ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం భారతదేశం సమర్పించిన  చిత్రాల్లో అత్యధిక సంఖ్యలో నటించిన వారి జబితాలో కూదా ఉన్నరు. గతంలో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, విద్యా బాలన్ వారు వారి అవార్డులు వెనక్కి ఇవ్వబోము అని చెప్పారు . షా రుక్ , విద్యాబాలన్ ఇద్దరూ పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో ఉన్నారు..

ఇప్పటి పభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్నమన్న విషయాన్ని,ప్రభుత్వ ధోరణికి విముఖంగా ఉన్న ప్రజలకు నైతిక మద్దదు కొసం అవార్డుల వాపస్ జరుగున్న విషయం తెలిసిందే. ఐతే ఎక్కడో శ్రీలంక లో ఉన్న తమిళుల కోసం కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు తన సొంత కీర్తిని వదులుకోవలసి వచ్చేసరికి ఇలా తప్పించుకోవటం ఎంతవరకూ సరైందో… అన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయ్.

Must Read: అలీ అసభ్య  కామెంట్ల పై యూట్యూబ్ లో విమర్శలు గుప్పించిన అమ్మాయి.

(Visited 57 times, 1 visits today)