Home / Videos / సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో బాహుబలి-2 స్వైరవిహారం…!

సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో బాహుబలి-2 స్వైరవిహారం…!

సువిశాల సుసంపన్న మహిష్మతీ రాజ్యం లో అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేమిటి? వీర‌త్వానికి, ధీర‌త్వానికి నెలవైన ఆ రాజ్యంలో జరిగిన కుట్రకి అమరేంద్ర బాహుబలి ఎలా బలయ్యాడు? అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) మరణం తర్వాత , అతని భార్య దేవసేన (అనుష్క) ను మహామంత్రి బిజ్జలదేవ (నాజర్), భల్లాలదేవ (రానా) ఎలా చిత్రహింసల పాలు చేస్తారు? బాహుబలిని కుట్రపూరితంగా చంపి, రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత భల్లాలదేవుడి అకృత్యాలకు అడ్డూ ఆపూ లేకపోవటం శాంతం బాహుబలి-1 లో చూసిన వారికి, ఇప్పుడు బాహుబలి -2 లో ఏమి జరగబోతోంది అనేదానిపైన సహజంగా ఆసక్తి రేకెత్త డాన్ని బాహుబలి-2 స్టోరీ ఊహాగానం పేరిట కొందరు అభిమానులు రూపొందించిన ఈ యు ట్యూబ్ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తోంది. కేవలం ట్రైలర్ వర్షన్ లోని సన్నివేశాలు, కాసిన్ని టైటిల్స్ తో రూపొందించిన ఈ పొట్టి వీడియో…..దగ్గర దగ్గర ఏడు లక్షల తొంభై వేలకు పైగా వ్యూస్ సంపాదించింది..అంటే చూసిన వాళ్ళ సంఖ్య ఎనిమిది లక్షల క చేరుకోబోతోందన్న మాట!

పసిబాలుడైన బాహుబలి కుమారుణ్ణీ చంపడానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా అత‌డి త‌ల్లి దేవసేన అపర కాళిక అవ‌తార‌మెత్తి..క‌త్తిప‌ట్టి భల్లాల దేవుడి అనుచరుల్ని తుదముట్టించి, కొడుకును కాపాడుకొని, రాజ్యం దాటించిన తర్వాతి సన్నివేశాల కోసం ఈ వీడియో రూపకర్తలు ఎంచుకున్న విజువల్స్ బాహుబలి-1 లోనివే. అయినా, బాహుబలి స్టోరీ కున్న క్రేజ్ ను ఈ పొట్టి చిత్రం రూపకర్తలు బహు చక్కగా వీడియో రూపంలో మలిచారు. దేవసేన కొడుకు…. శివుడుగా (రెండో ప్రభాస్) అడవిలో పెరిగినప్పటి సన్నివేశాలు, త‌న తండ్రికి, త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలుసుకున్న శివుడు మూడో క‌న్ను తెర‌చి ప్రళయకాల రుద్రుడవటం…ఆ తర్వాత, శివుడు, కట్టప్ప, అస్లామ్ ఖాన్ లతో కలిసి భాళ్లాలదేవ ను చంపటంతో కథ ముగుస్తుంది. దీన్ని , పాత విజువల్స్ తోనే చాలా జాగ్రత్తగా కేవలం రెండున్నర నిమిషాల వ్యవధి గల యు ట్యూబ్ చిత్రం గా మలచటం చాలా ఆసక్తి రేకెత్తించింది..సొ..బాహుబలి స్టోరీ కి ఇంకా క్రేజ్ తగ్గనట్టే గదా!

Also Read: స్వాతంత్ర్యానికి పూర్వమే ఇంటర్ నెట్ ఉంటే భారత్ లో ఇలా ఉండేది…!

(Visited 71 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]