డాన్ ఒకప్పుడు ఇండియన్ సెల్యులాయిడ్ ని ఒక ఊపు ఊపిన పాత్ర. అమితాబ్ మాఫియ లీడర్ గా చేసిన ఈ సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. బయట ఉన్న మాఫియ లీడర్లకి కూడా ఒక స్టార్ ఇమేజ్ ని తీసుకు వచ్చింది. తెలుగు తెరకి కూడా మాఫియా థ్రిల్ ని చూపించింది కేవలం ఇదే సబ్జెక్ట్ తో రాం గోపాల్ వర్మ లాంటి దర్శకులు కూడా జనాన్ని ఆకర్షించారు. ఇప్పటికీ డాన్ వెండి తెరపై వెలుగుతూనే ఉన్నాడు. మణిరత్నం సినిమా “నాయకుడు” లో కమల్ హసన్, “భాషా” లో రజినీ కాంత్ లు నిన్నటి తరం డాన్ కి ఒక డిఫరెంట్ లుక్ ని తెస్తే భిల్లా తో తమిళ,తెలుగు భాషల్లో అజిత్, ప్రభాస్ లు ఒక స్టైలిష్ లుక్ తో పాటు సినిమా డాన్ కి ఒక కొత్త హీరోఇజం ఆడ్ చేసారు. ఐతే బిల్లా తర్వాత పెద్దగా డాన్ ల హవా నడవలేదు. కామెడీ సినిమాల్లో కూడా డాన్ లతో చిల్లర పనులు చెయించే సరికి డాన్ కాస్త నీరస పడ్డాడు.కొంత కాలం గా సరైన వెండితెర డాన్ కి సరైన బూస్ట్ అందలేదనే చెప్పాలి.
ఐతే ఇప్పుడు సీన్ మారబోతోంది మళ్ళీ డాన్ తన సత్తా ఏంటో చూపించ బోతున్నాడు. ఒక్కరు కాదు ఇద్దరు పవర్ ప్యాక్ హీరోలు డాన్ లుగా ఇండియన్ స్క్రీన్ ని ఊపు ఊపబోతున్నారు. తెలుగు తెర నుంచి లయన్ బాలయ్య “డిక్టేటర్” గా వస్తూంటే తమిళ తెర నుంచి సూపర్ స్టార్ రజినీ కాంత్ “కబాలి” (తెలుగులో కపాలి) గావస్తున్నాడు రజినీకాంత్ కి డాన్ గా ఇది రెండో సారి కాబట్టి ఆయన సినిమా “కబాలి” పై ఇప్పటికే అంచనాలున్నాయి. ఐతే ఇక్కడ బాలకృష్ణ సంగతీ తెలిసిందే ఇది వరకు డైరెక్ట్ డాన్ గా కనిపించక పోయినా మన నందమూరి నటసింహానికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. మామూలు గానే డాన్ లా ఒక డైనమిక్ యాటిట్యూడ్ తో కనిపించే బాలయ్య ఇక నిజంగానే డాన్
క్యారెక్టరైతే ఇంక చెప్పాల్సిందేం లేదు.
ఖైరతాబాద్ వినాయకుడి సమక్షంలో చిత్ర బృందం వినాయక చవితి సందర్భంగా ఒక పాటని విడుదల చేసారు. వినాయకుడి మీద వచ్చే ‘గం.. గం.. గణేశ’ అనే సాంగును విడుదల చేసారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. బాలకృష్ణ పక్కన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగులు బాణంలా నందమురి అభిమానుల హృదయాలలోకి దూసుకు పోతాయని దర్శకుడు శ్రీ వాస్ చెపుతున్నాడు. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన పాత్రలో బాలకృష్ణ ఈసినిమాలో అధ్బుతం గా నటిస్తున్నాడని టాక్. ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ఉన్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ సినిమా ఉంటుందని ఈ సినిమా యూనిట్ చెపుతోంది. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా కోసం కొనవెంకట్ అందించిన కధకు శ్రీధర్ రాసిన డైలాగులు ఈ సినిమాకు హైలెట్ గా మారుతాయి అని అంటున్నారు. రాబోతున్న సంక్రాంతికి రాబోతున్న ఈసినిమా పై ఇప్పటికీ బయ్యర్లలో మంచి క్రేజ్ ఏర్పడటంతో ఈ సినిమా బాలకృష్ణ రికార్డులను బ్రేక్ చేస్తుందని అంటున్నారు. కొసమెరుపేంటంటే అయితే ఈ ఫస్ట్ లుక్ పై నందమూరి తారక రామారావు నటించిన ‘గజదొంగ’ సినిమా లుక్ ని పోలి ఉందని కొందరనుకుంటున్నారు.
Must Read: తెలుగు హీరోల పది పాపులర్ పంచ్ లు.
ప్రస్తుతం ‘కబాలి’ ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. తొలి షూటింగ్ పనులు మలేషియాలో జరుగుతున్నాయి. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నాడు. సినిమా స్టోరీ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేశారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే.. అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది. ఇరవయ్యేళ్ళ క్రితం ఇదే తరహా కథ తో వచ్చిన “భాషా” దక్షిణాదినే కాదు భారతీయ సినిమానే నే ఒక ఊపు ఊపిన సినిమా. రజినీ మానిక్ భాషా గా మాఫియా డాన్ పాత్రకి ప్రాణం పోసి ఒక యూనిక్ గా నిలిచాడు. అదే ఫార్ములా తో కోలీవుడ్ లోనూ, టాలీ వుడ్ లోనూ ఎన్నో సినిమాలొచ్చాయ్. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా సామాన్యుడి గా కనిపించే హీరో వెనక ఉన్న అసలు కథ ఇంటర్ వెల్ కి ముందు ఓపెన్ అయ్యి సెకెండాఫ్ లో హీరో పూర్తిస్తాయి లో విర్చుకు పడటం విలన్లని మట్టి కరిపించటం ఈ పాయింట్ ఎన్నొ హిట్ సినిమాలని ఇచ్చిందో అందరికీ తెల్సిందే. ఇప్పటికీ మాఫియా కథల్లో డాన్ పాత్ర చేసే నటులకు రజనీకాంత్ నటన ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అదే స్థాయి సంచలనానికి తెర లేచినట్టే కనిపిస్తోంది. సూపర్ స్టార్ మళ్ళీ ఇంకో సారి మాఫియ డాన్ గా కనిపించ బోతున్నాడు. చెన్నై మాఫియా నేపధ్య కథ లో మరో సారి తన స్టామినా ఏంటో చూపించేందుకు సిద్దమయ్యాడు. తన కొత్త ప్రాజెక్టు “కబాలి” లో ఇంకోసారి డాన్ గా తన అభిమానులకు కనిపించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వినాయక చవితి సందర్బంగా విడుదలయింది. మరి ఈ ఇద్దరు డాన్ లలో ఎవరు ఎన్ని రికార్డులు కొడతారో చూడాలి..