Home / health / బననా టీ తాగితే పడుకున్న వెంటనే నిద్రపోవచ్చు.

బననా టీ తాగితే పడుకున్న వెంటనే నిద్రపోవచ్చు.

Author:

ఇప్పుడంతా బిజీ లైఫ్ …. ఉరుకుల పరుగులా జీవితంలో మనల్ని మనమే కోల్పోతున్న సమయం. ఇక అందులో రోజు ఉండే టెన్షన్ కి రాత్రి నిద్రపట్టదు. లేటుగా తినడం, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్.. వెరసి మన లైఫ్ స్టైల్ పూర్తిగా ఛేంజ్ అయింది. అర్థ రాత్రి అయినా నిద్ర పట్టక కొట్టుకునే వారెందరో ఎంత టైం అయినా మేల్కొని ఆలోచిస్తూ ఎప్పుడో పడుకుంటారు. ఇక తెల్లవార్లూ 8-9 గంటల మధ్య లేచి తొందర తొందరగా తయారై వారి వారి పనులకు వెలుతుంటారు. ఆఫీసు లోను ఉండే పని వత్తిడి వలన మానసిక ప్రశాంతతా అనేది లేకుండా పోయింది. ఆలస్యంగా నిదురపోవడం వలన అనేక శారీరక సమస్యలు వస్తున్నాయి.షుగర్,హైబీపీ, హార్ట్ ఎటాక్, బరువు పెరగడం, హార్మోన్ల సమతౌల్యం దెబ్బ తినడం వంటి రోగాలు కొనితెచ్చుకుంటుంన్నారు . పడుకున్న వెంటనే నిద్ర పట్టడానికి మీకోసం ఇంట్లోనే తయారుచేసుకోగలిగే ఒక సహజమైన చిట్కా మీకోసం.

banana-tea-will-helps-us-for-better-sleeping

బననా టీ తయారుచేయు విధానం:

  • ముందుగా రెండు అరటి పండ్లను తీసుకొని వాటి కొసలు రెండు వైపులా కట్ చేసి తొక్కతో సహా అలానే ఒక గిన్నెలో వేయాలి.
  • గిన్నెలో తగినంత నీరుపోసి దాల్చి చెక్కను అందులో వేసి 10 నిమిషాలు మరగపెట్టాలి.
  • మరిగిన నీటిని వడపోసి పడుకునే ముందు రోజుకు ఒక కప్పు తాగాలి.
  • అరటి తొక్కలో పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి వెంటనే
    నిద్రపట్టడానికి సహాయం చేస్తాయి.

బననా టీ ని తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా తెలిపారు, కాబట్టి ప్రశాంతమైన నిద్ర కోసం బననా టీ ని ఒకసారి ప్రయత్నిచండి.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 3,483 times, 1 visits today)